Rose Water In Daily Routine: రోజ్ వాటర్‌ను సాధారణంగా ఏదైనా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేస్తే ఉదయం ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే, రోజ్ వాటర్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
రోజ్ వాటర్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం పై ఉండే రంధ్రాలు త్వరగా తగ్గిపోతాయి. ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు రోజ్ వాటర్‌తో ముఖానికి మృదువుగా మసాజ్ చేసుకోవాలి. దీంతో మీ చర్మం టైట్‌గా మారి అందమైన ముఖాన్ని పొందుతారు
అంతేకాదు రోజ్‌వాటర్‌తోఇలా ముఖం పై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. ప్రతిరోజూ ముఖానికి రోజ్ వాటర్‌తో మసాజ్ చేయడం వల్ల మీ ముఖం నిత్య యవ్వనంగా కూడా కనిపిస్తుంది. మీ ముఖ ఆకృతి కూడా మెరుగవుతుంది. ఈ రోజ్ వాటర్‌ను ఏదైనా ఫేస్ ప్యాక్ లో కూడా వేసి వినియోగించవచ్చు.
డ్రై స్కిన్ సమస్య ఉన్నవారికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్ రెమిడీ. రోజ్ వాటర్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఉంటుంది.అంతేకాదు ఇది చర్మానికి మాయిశ్చర్ అందిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖం డల్‌గా మారుతుంది.
సన్ బర్న్ వల్ల ముఖంపై ట్యాన్ పేరుకుంటే కూడా ఇది ఎఫెక్టీవ్ రెమిడీగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ తీసుకుని చేతిలో వేసి ముఖానికి సర్క్యూలర్ మోషన్లో మసాజ్ చేస్తూ ఉండాలి. దీంతో చర్మం పై ఉండే ట్యాన్ తొలగిపోతుంది. ఇది ముఖానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది.
రోజ్ వాటర్ ప్రతిరోజూ చర్మంపై అప్లై చేయడం వల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. మీకు ట్యాన్ సమస్య ఉంటే ప్రతిరోజూ రోజ్ వాటర్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేస్తే సమస్య నుండి ఉపశమనం పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )