International Yoga Day 2024: ప్రపంచానికి యోగా సహా పలు విద్యలకు పుట్టినిల్లు భారత దేశం. ప్రస్తుతం యోగాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఆదరిస్తున్నారు. అసలు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సం ఎలా సాధ్యమైంది. ఆ రోజునే ఎందుకు యోగా దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు.
2014లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015లో తొలిసారి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాము.
ఈ సారి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 సెప్టెంబర్ లో ఐక్యరాజ్యస మితిలోని భద్రతా మండలిలో జూన్ 21 వ తేదిన ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుందామని ప్రతిపాదించారు.
ముందుగా చైనా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరపడంపై ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఆ తర్వాత అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ అలా భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు వీటికి మద్దతు తెలుపుతూ ఓటు వేసాయి.
అటు ఆఫ్రిక కంట్రీ అయిన మొజాంబిక్ కూడా ఈ ప్రతిపాదనకు సై అంది. మొత్తంగా ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 11న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది
అప్పట్లో ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలకు గాను 177 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకునేందుకు అంగీకారం తెలిపాయి. యోగాతో మన దేశ ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరించింది.
తొలిసారి 2015లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డిల్లీలో రాజ్ పథ్ దగ్గర జరిగిన యోగా దే 37 వేల మందితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ యోగాసనాలు వేయడం విశేషం. అంతేకాదు దీనికోసం ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు కూడా చేసారు.
జూన్ 21న పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మరో రోజుకు ఈ ప్రత్యేకత ఉండదు. ఈ రోజు నుంచి పగలు తక్కువైతూ.. రాత్రి పూట పెరుగుతూ ఉంటుంది. అందుకే సైంటిఫిక్ గా ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటిం
ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీ నగర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మరోవైపు న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 10వ అంతర్జాతీయత యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు.