Beauty Tips: శ్రీవల్లిని మించిన అందం మీ సొంతం కావాలా? అయితే ఈ పండ్లు తినండి

Beauty Tips:వయస్సు మీదపడ్డాక చర్మం వృద్ధాప్యం అనేది సాధారణం. అయితే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కహాల్ సేవించినా ముఖంపై అకాల మచ్చలు వస్తాయి. అయితే మీరు కొన్ని పండ్లు తింటే ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు. చర్మం ముడతలు తగ్గాలంటే..మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి పండ్లను చేర్చుకోవాలో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 

1 /7

Beauty Tips:వృద్ధాప్యం అనేది సహజం. అయితే  కొన్ని సార్లు పలు కారణాల వల్ల కొంతమంది త్వరగా వయస్సుమీదపడినట్లు కనిపిస్తారు. అలాంటి వారు డైట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే వృద్ధాప్య సమస్యను తగ్గించుకోవచ్చు. ముడతలు లేని చర్మం మంచి ఆరోగ్యం కోసం మీ డైలీ డైట్లో పండ్లను చేర్చుకోవాలి. పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఎలాంటి పండ్లను డైట్లో చేర్చుకోవాలో చూద్దాం. 

2 /7

దానిమ్మ:దానిమ్మలో విటమిన్ సి, ఫోలిఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాదు చర్మాన్ని మెరిచేలా చేస్తుంది. దానిమ్మను చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు.   

3 /7

జామపండు:జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమోతాదులో ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా మారుతుంది.   

4 /7

బొప్పాయి:బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పాపైన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. బొప్పాయిలోని విటమిన్లు, ఎంజైమ్స్  మృత చర్మాన్ని తొలగించి కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.   

5 /7

మామిడిపండ్లు: మామిడిపండ్లల విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్, లుటిన్ వంటి పలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

6 /7

అరటి: అరటిపండులో విటమిన్ ఎ, బి విటమిన్లు, విటమిన్ సి, మరియు డోపమైన్, కాటెచిన్స్ వంటియాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మంపై ముడతలు, పైన్ లైన్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. 

7 /7

పుచ్చకాయ:పుచ్చకాయలో లైకోపీన్, అమైన్ యాసిడ్స్ అధికమొత్తంలో ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన ముఖ ఛాయను ప్రోత్సహిస్తాయి.