Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..

Wayanad Landslides Photos: ప్రకృతి ప్రకోపం మళ్లీ కేరళపై చూపించింది. ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడటంతో ఇప్పటి వరకు 47 మంచి చనిపోయారు. ఇంకా ఆ శిథిలాల కింద కొన్ని వందలమంది చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 

1 /10

కేరళ వయనాడ్‌లో కొండచరియాలు విరిగిపడిన ఘటనలో కొన్ని వందల మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు ఈ పెనువిషాదంలో ప్రాణాలు, భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.   

2 /10

ఈ ఉదయం వయనాడ్‌ మెప్పాడి కొండచరియల ఘటనల వల్ల ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. కొండచరియల కింద ఇరుక్కున్న వారిని ప్రాణాలతో బయటకు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ సీఎం పినరాయి విజయన్‌ చెప్పారు.   

3 /10

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తూ ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి మిగ్‌ విమానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.  

4 /10

అంతేకాదు ముఖ్యమంత్రి విజయన్‌ కేంద్ర మంత్రులతో మాట్లాడారు. వారి నుంచి సహాయం కూడా కోరారు దీనికి వారు ఏ సహాయం చేయడానికి అయినా వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.  

5 /10

ఇదిలా ఉండగా మెప్పాడి గ్రామలో అర్ధరాత్రి కొండచరియలు విరిగి పడటంతో గాఢనిద్రలోనే ఎంతో మంది ప్రాణాలను విడిచిపెట్టారు. ఈ దారుణ ఘటనలో ఎన్నో వందల మంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కొంతమంది తమ కుటుంబీకుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.  

6 /10

వెంటనే స్పందించిన పీఎం మోడీ ట్వీట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కేంద్ర తరఫున మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

7 /10

ఈ దుర్ఘటనలో చుర్మాల్ గ్రామంలోని వందలాది ఇళ్లు, వాహనాలు నీటమునిగిపోయాయి. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతోంది.   

8 /10

కేరళలోని వయనాడ్‌లో కొండచరియాలు విరిగి పడిన ఘటనలో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది.  

9 /10

అన్ని ప్రభుత్వ సంస్థలతో కలిపి పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. బాధితులను రక్షించేందుకు మిగ్-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి.  

10 /10

ముండకై బ్రిడ్జి కూలిపోవడంతో తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి...