Lung Cancer Reasons: సిగరెట్ స్మోకింగ్, కాలుష్యం మాత్రమే కాదు ఈ 5 కూడా లంగ్ కేన్సర్‌కు కారణాలే

Lung Cancer Reasons: World Lung Cancer Day ఆగస్టు 1వ తేదీన జరుపుకోనున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్ అవగాహన దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం. లంగ్ కేన్సర్ సోకినప్పుడు ఊపిరితిత్తుల్లో కణాలు అదుపు లేకుండా పెరిగిపోతాయి. నెమ్మదిగా ఇతర అవయవాలకు సైతం వ్యాపిస్తుంది. ప్రారంభదశలో ఎలాంటి లక్షణాలు పెద్దగా కన్పించవు. 

Lung Cancer Reasons: సాధారణంగా లంగ్ కేన్సర్ అంటే సిగరెట్ తాగేవారికే వస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. లంగ్ కేన్సర్‌కు కారణం ధూమపానం, కాలుష్యం మాత్రమే కాదు ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1 /5

ఆస్ బెస్టాస్ ఇదొక ఖనిజం. దీనిని నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారు. శ్వాస తీసుకునేటప్పుడు ఆస్ బెక్టార్ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లో చేరి కేన్సర్‌కు కారణమౌతాయి.

2 /5

రెడాన్ గ్యాస్ ఇదొక నేచురల్ గ్యాస్. దీనికి రేడియో యాక్టివ్ గుణాలుంటాయి. ఇది ఇళ్లలో , భవంతుల్లో ఉండవచ్చు. దీర్ఘకాలంగా ఈ గ్యాస్ పీలుస్తుంటే లంగ్ కేన్సర్ ముప్పు పొంచి ఉన్నట్టే.

3 /5

కెమికల్స్ ఆర్సానిక్, క్రోమియం, నికెల్ వంటి రసాయనాలు ఊపిరితిత్తుల కేన్సర్ కారకమౌతాయి

4 /5

కుటుంబ చరిత్ర కుటుంబంలో ఎవరికైనా లంగ్ కేన్సర్ ఉంటే మీక్కూడా ఇది సంభవించే అవకాశాలున్నాయి. అంటే ముప్పు పొంచి ఉందని అర్ధం

5 /5

వైరస్ హ్యూమన్ పాపిలోమావైరస్, హెపటైటిస్ సి వంటి వైరస్ రకాలు లంగ్ కేన్సర్ కారణం కావచ్చు.