Malvi Malhotra: ఆ క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంది.. బాంబు పేల్చిన మాల్వీ మల్హోత్రా..

Raj tarun Lavanya controversy:   హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా లు నటించిన సినిమా తిరగబడరా సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

1 /6

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో సినిమాలకు మించి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో.. ఇప్పటికే లావణ్య.. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, పదేళ్లపాటు ఇంట్లో పెట్టుకుని మోసం చేశాడంటూ కూడా తెల్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

2 /6

మరోవైపు రాజ్ తరుణ్ కూడా తనకు, లావణ్య ఫ్రెండ్ మాత్రమే అని, అబార్షన్ లాంటిది చేయిందచలేదని తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తనను కావాలని లావణ్య.. బెదిరింపులకు గురిచేసి డబ్బులు గుంజడానికి ప్రయత్నింస్తుందని రాజ్ తరుణ్ చెప్పుకొస్తున్నారు.

3 /6

లావణ్యకు, మస్తాన్ అలీతో పాటు చాలా మందితో ఎఫైర్ ఉందని కూడా రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు మాల్వీ మల్హోత్రా కూడా లావణ్య బెదిరింపులకు గురిచేసిందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జులై 31) న రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా లు తిరగబడగా సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్  హైదరాబాద్ లో జరిగింది.  

4 /6

ఆగస్టు 2 న తిరగబడరా సామి విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాను ఆదరించాలని కూడా రాజ్ తరుణ్ ,మాల్వీ మల్హోత్రా మీడియా ముఖంగా అందరికి కోరారు. కానీ ఈ సమావేశంలో లావణ్య వివాదంపైన ఎక్కువ మంది రాజ్ తరుణ్ కు ప్రశ్నలు వేశారు. దీనికి సమాధానంగా రాజ్ తరుణ్ తనపై లావణ్య లేని పోనీ నిందలు వేస్తుందని ప్రతిదానికి తన దగ్గరు ఆధారాలుఉన్నాయని చెప్పుకొచ్చింది.  

5 /6

మరోవైపు మాల్వీ మల్హోత్రా.. లావణ్యపై సంచలన ఆరోపణలు చేసింది. గతంలో 2020 లో తనమీద దాడిచేసిన కొంత మంది క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంటుందని చెప్పింది. ఒక అమ్మాయివై ఉండి.. వాళ్లతో టచ్ లో ఉండటం అంత కరెక్ట్ కాదని తాను చెప్పినట్లు కూడా మాల్వీ మల్హోత్రా మీడియా ముఖంగా చెప్పింది. క్రిమినల్స్ తో టచ్ లో వెళ్లినందుకు.. లావణ్యను కూడా తాను క్రిమినల్ గానే భావిస్తానని కూడా మాల్వీ మల్హోత్రా తెల్చి చెప్పింది.   

6 /6

రాజ్ తరుణ్ మాట్లాడుతూ..దయ చేసి ఈ లావణ్య గోల సినిమా మీద చూపించవద్దని, మాల్వీ మల్హోత్రా ఈ  మూవీ కోసం ఎంతో కష్టపడిందని కూడా చెప్పుకొచ్చాడు. నిర్మాతలు, మూవీ టిమ్ అంతా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారని కూడా రాజ్ తరుణ్ చెప్పారు. ఆగస్టు 2 న విడుదలయ్యే ఈ సినిమాను ఆదరించాలని రాజ్ తరుణ్ కోరాడు.