Vitamin C Rich Foods: వర్షాకాలంలో విటమిన్ సి ఎందుకు అవసరం, ఏయే ఫ్రూట్స్ అధికంగా తినాలి

వర్షాకాలం నిస్సందేహంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు కారణమౌతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తకి పెంచాలంటే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే 5 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vitamin C Rich Foods: వర్షాకాలం నిస్సందేహంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు కారణమౌతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తకి పెంచాలంటే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే 5 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

షిమ్లా మిర్చి షిమ్లా మిర్చి చాలా రంగుల్లో లభిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఐరన్ అబ్జారప్షన్ పెంచుతుంది. షిమ్లా మిర్చి తినడం వల్ల జలుబు, జగ్గు వంటి సమస్యలకు చెక్ చెప్పవచ్చు. సలాడ్, సూప్, ఫ్రై రూపంలో తీసుకోవచ్చు.

2 /5

ఉసిరి ఉసిరి అంటేనే విటమిన్ సికు కేరాఫ్ అని అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. వర్షాకాలంలో ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిని పచ్చిగా లేదా జ్యూస్ లేదా పికెల్ రూపంల తీసుకోవచ్చు. 

3 /5

నిమ్మ విటమిన్ సి భారీగా లభించే ఏకైక ఫ్రూట్ ఇదే. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. వర్షాకాలంలో నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటే శరీరం డీటాక్స్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

4 /5

బొప్పాయి బొప్పాయిలో కూడా విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ బలోపేతం చేసేందుకు వర్షాకాలంలో బొప్పాయిని మించింది లేదు. శరీరం ఎదుర్కునే వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. 

5 /5

ఆరెంజ్ ఆరెంజ్ విటమిన్ సి అధికంగా లభించే బెస్ట్ ఫ్రూట్. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఇందులో ఫైబర్ మోతాదు చాలా అధికంగా ఉంటుంది. ఆరెంజ్ తినడం వల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. వర్షాకాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగడం చాలా మంచి అలవాటు. దీనివల్ల జలుబు, ఫ్లూ, దగ్గు వంటివి దూరం చేయవచ్చు.