LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!

 Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు,  పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.
 

1 /5

LIC Kanyadan Policy: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా అనేక రకాల పాలసీలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఎల్‌ఐసీ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం కూడా కొన్ని రకాల పాలసీలను ప్రారంభించింది. వీటిలో మీరు డబ్బు పెట్టడం ద్వారా భవిష్యత్తులో వారి చదువులకు నిజానికి చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తె చదువు, పెళ్లి ఖర్చుల గురించి ఆందోళన చెందడం అనేది సహజం.  ఇలాంటి పరిస్థితుల్లో కూతుళ్ల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని ప్రారంభించింది. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.  

2 /5

LIC కన్యాదాన్ పాలసీ అంటే ఏమిటి? కుమార్తె సురక్షిత భవిష్యత్తు కోసం ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ ప్రారంభించింది. మీరు మీ కుమార్తె చదువు లేదా వివాహ ఖర్చుల కోసం ఈ పాలసీని ప్రారంభించవచ్చు. ఈ పాలసీలో మీరు ప్రతిరోజూ రూ. 121 డిపాజిట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రతి నెలా రూ. 3,600 పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు.  LIC కన్యాదాన్ పాలసీ మెచ్యూరిటీ కాలపరిమితి 25 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత, పెట్టుబడిదారుడు రూ. 27 లక్షల లాభం పొందుతాడు

3 /5

ఇందులో మీరు 13 నుండి 25 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకోవచ్చు. మీరు రోజూ రూ. 75 అంటే నెలకు రూ. 2,250 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీలో పెట్టుబడిదారుడికి రూ. 14 లక్షలు లభిస్తాయి. ఈ విధానంలో పెట్టుబడిదారు పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి మొత్తాన్ని బట్టి ఫండ్ మారుతుంది. 

4 /5

LIC కన్యాదాన్ పాలసీ ఫీచర్లు ఇవే: ఈ పాలసీలో కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం ఉండాలి. LIC కన్యాదాన్ పాలసీలో పెట్టుబడిదారుడు టాక్స్ బెనిఫిట్ ప్రయోజనాన్ని కూడా పొందుతాడు. ఇందులో, మీరు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ పాలసీ రూ. 1.5 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్స్ అందిస్తుంది.  పాలసీదారు మరణిస్తే, కుటుంబ సభ్యునికి రూ.10 లక్షల వరకు ప్రొవిజన్ అమౌంట్ అందుతుంది. అదే సమయంలో, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, నామినీ రూ. 27 లక్షలు పొందుతారు.  

5 /5

ఈ పాలసీ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, కుమార్తె బర్త్ సర్టిఫికేట్.