Triptii Dimri: తృప్తి డిమ్రి చేతిలో క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు.. హాట్ భామకు క్యూ కడుతున్న ఛాన్సులు.

Triptii Dimri: తృప్తి డిమ్రి .. ఎన్ని సినిమాలు చేసినా.. రాని గుర్తింపు యానిమల్ సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ తో తృప్తి  చేసిన హాట్ హాట్ ఇంటిమేటేడ్ సీన్స్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్ గా ‘బ్యాడ్ న్యూజ్’తో మంచి హిట్ అందుకుంది తృప్తి. తాజాగా ఈ భామకు వరుసగా క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో  అవకాశాలు వస్తున్నాయి.

1 /7

తృప్తి డిమ్రీ యాక్ట్రెస్ గా  ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 ఇయర్స్ అవుతున్న.. గతేడాది  సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా పాపులార్ అయింది.

2 /7

ఈ సినిమాలో ఈ భామ స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగింది. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తృప్తి నటించిన ఈ బూతు సినిమాకు  దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం చూసి క్రిటిక్స్ నోరెళ్ల బెడుతున్నారు.  

3 /7

తాజాగా ఈ భామ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్.. స్పిరిట్ తో పాటు.. ‘యానిమల్ పార్క్’ సినిమాలతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఈ భామ స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

4 /7

తృప్తి విషయానికొస్తే..  2017లో శ్రీదేవి టైటిల్ రోల్ లో నటించిన ‘మామ్’ మూవీలో చిన్న క్యారెక్టర్ తో వెండితెరకు పరిచయం అయింది.  అదే యేడాది  సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీస్ తో కథానాయికగా పరిచయమైంది.

5 /7

ఇక 2018లో రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

6 /7

అటు 2021లో  ఫోర్బ్స్  అండర్ 30 లిస్టులో పేరు సంపాదింకుంది. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.

7 /7

తృప్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. అంతేకాదు ఇంగ్లీష్ హానర్స్ తో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదవు పూర్తైయిన తర్వాత పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్  లో నటనలో శిక్షణ తీసుకుంది.