Keerthy Suresh: కీర్తి సురేష్ సింగిల్ కాదంట.. ఎవరితో డేటింగ్ చేస్తోందంటే..!

Keerthy Suresh relationship: కీర్తి సురేశ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. త్వరలో ఆమె రఘు తాత.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్‌లో.. బిజీగా ఉన్న కీర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రేమ, రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడారు. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి..అనే దాని మీద స్పందించారు. తాను సింగిల్ కాదు అనే హింట్ కూడా ఇచ్చి షాక్ ఇచ్చారు

1 /5

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో.. కీర్తి సురేష్ కూడా ఒకరు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో.. ఈమె బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. కీర్తి సురేష్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా కీర్తి సురేష్ ఇంటర్వ్యూ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది.

2 /5

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కీర్తి సురేష్ కి.. తన వ్యక్తిగత జీవితం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. తన జీవిత భాగస్వామి ముందు తనకి.. మంచి ఫ్రెండ్ అయి ఉండాలని అంటోంది. “మా ఇద్దరి మధ్య బంధం ఇచ్చిపుచ్చుకునే లాగా ఉండాలి. మేము మంచి స్నేహితులం అయి ఉండాలి.. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే అంతే చాలు" అని అన్నారు కీర్తి సురేష్.  

3 /5

ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని అడగగా కీర్తి సురేష్.. ప్రేమంటే జీవితకాలం ఉండే సంతోషం అని అన్నారు. ఇక తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడగగా.. "చాలామంది నేను సింగిల్ అనుకుంటున్నారు. కానీ నేను సింగిల్ అని చెప్పలేదు కదా?" అని తిరిగి ప్రశ్నించారు కీర్తి సురేష్. దీంతో కీర్తి సురేష్ ఎవరితో అయినా ప్రేమలో ఉందా.. అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.  

4 /5

సింగిల్ కాదు అంటే ఎవరో ఒకరితో.. రిలేషన్షిప్ లో ఉన్నట్టే. మరి కీర్తి సురేష్ ఎవరితో ప్రేమలో ఉంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సినిమాల పరంగా చూస్తే కీర్తి సురేష్ త్వరలో రఘు తాత అనే సినిమాలో కనిపించనుంది. అంతేకాకుండా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది

5 /5

తమిళ్లో విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా.. నటించిన తెరి సినిమా హిందీ రీమేక్ అయిన బేబీ జాన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సమంతా నటించిన పాత్రలో చేయడానికి భయంగా లేదు అని.. ఆ పాత్రని చాలా అందంగా చిత్రీకరించారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కీర్తి సురేష్