Ranu Mandal: ఓవర్‌ నైట్‌ స్టార్‌ సింగర్‌గా మారిన ఆ యాచకురాలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..! పరిస్థితి మరింత దారుణం

Ranu Mondal Life: గతంలో ఎక్కడో కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాణు మొండల్‌.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్‌నైట్ స్టార్‌ మారిపోయింది. యాచకురాలి నుంచి గాయనిగా మారిన ఆమె.. కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగారు. ముంబైలో లగ్జరీ లైఫ్‌ను అనుభవించారు. అయితే ఆ తరువాత అవకాశాలు తగ్గిపోయి మళ్లీ పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది..? ఎలా ఉన్నారు..?
 

1 /8

రేణు మండల్ గాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె దశ తిరిగిపోయింది. సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్ రేష్మియా పిలిపించి బాలీవుడ్‌లో అవకాశం ఇచ్చారు.  

2 /8

సినిమాల్లో పాటలు పాడి మరింత ఫేమస్ అయ్యారు రేణు మండల్. ఆషికీ మేరీ అనే పాటతో బాగా క్రేజ్ వచ్చింది.   

3 /8

2019లో రేణు మండల్ బాగా వార్తల్లో నిలిచారు. అయితే ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? అని చాలామంది ఆసక్తిగా వెతుకుతున్నారు.  

4 /8

బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయిన తరువాత అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక ముంబైలో ఇంటిని రేణు మండల్ ఖాళీ చేశారు.  

5 /8

కోల్‌కతాకు తిరిగి వచ్చి.. ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఎలా ఉన్నారని వెతుక్కుంటూ ఓ యూట్యూబ్ వ్లాగర్ వెళ్లాడు.  

6 /8

అయితే తనను చూసేందుకు వచ్చిన వారి ముందు రేణు మండల్ వింత కోరికలు పెడుతున్నారట.   

7 /8

ఆహారం, వంట సామాగ్రి తీసుకురావాలని కోరుతున్నారట. ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని ఆ యూట్యూబర్ చెప్పాడు.  

8 /8

ఒకప్పుడు బాలీవుడ్‌లో సింగింగ్‌ స్టార్‌గా ఎదిగిన రేణు మండల్.. ఇప్పుడు భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారు.