7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల దీపావళి గిఫ్ట్‌గా జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది డబుల్ గుడ్‌న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. జనవరి నెలలో డీఏ పెంపు, బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం ఉంటుంది. సెప్టెంబర్ నెల వరకు 0.07 పాయింట్లు పెరిగి 143.3 పాయింట్లకు చేరుకుంది.
అంతకుముందు జూలైలో 142.7 పాయింట్లు, ఆగస్టులో 142.6 పాయింట్లుగా ఉంది. అక్టోబర్ నెలకు సంబంధించి డేటా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.
ఈ దీపావళికి డీఏ 3 శాతం పెంచగా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిది. దీంతో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయి.
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రకటన బడ్జెట్‌లో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందజేసినది. వేతనాల పెంపు, కొత్త పే కమిషన్‌కు సంబంధించిన వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్‌ను సందర్శించండి.