Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయాల్లో వెళ్లి చిన్ని కృష్ణుని పూజించడం అనేది ఆనవాయితీ. ఈ సందర్భంగా మీరు చిన్ని కృష్ణుడిని కొలవాలనుకుంటున్నారా అయితే హైదరాబాదులో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయాల గురించి తెలుసుకుందాం. జన్మాష్టమి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు.

అబిడ్స్, ఇస్కాన్ టెంపుల్ : నగరంలోని అబిడ్స్ సెంటర్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.
కాచిగూడ, శ్యాం మందిర్: కాచిగూడ లోని శ్యామ్ మందిర్ నగరంలోని సుప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయం. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు.
బాగ్ అంబర్ పేట్, గురువాయుర్ శ్రీ కృష్ణ దేవాలయం: బాగ్ అంబర్ పేట్ లో ఉన్న గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నగరం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.
నాగోల్, శ్రీకృష్ణ దేవాలయం : నాగోల్ నుంచి ఎల్బీనగర్ కు వెళ్లే దారిలో, రామకృష్ణాపురం వద్ద శ్రీకృష్ణ దేవాలయం అతిపెద్ద ప్రాంగణంలో నిర్మించారు. ఇక్కడ జరిగే శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసేందుకు నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.
బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 11, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ : బంజారాహిల్స్ లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
దిల్ సుఖ్ నగర్ లో ఉన్నటువంటి కృష్ణానంద మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
బోడుప్పల్ ప్రాంతంలో కొలువైన శ్రీకృష్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.