Sobhita Dhulipala: అక్కినేని ఫ్యామిలీకి బిగ్ షాక్..ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమైన కాబోయే కోడలు..!

Sobhita Dhulipala item song: అక్కినేని నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాల.. డాన్ సీరీస్ 3 లో రణవీర్ సింగ్ పక్కన ఐటమ్ సాంగ్ చేయబోతుందంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఈ వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 27, 2024, 10:09 AM IST
Sobhita Dhulipala: అక్కినేని ఫ్యామిలీకి బిగ్ షాక్..ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమైన  కాబోయే కోడలు..!

Naga Chaitanya and Sobhita: ఈ మధ్యకాలంలో అక్కినేని నాగచైతన్య.. సమంత నుంచి దూరమైన.. తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాలతో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.  ఇక 2024 ఆగస్టు 8న ఆ రిలేషన్ ను నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ తో తమ బంధాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లారు.  త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

నిజానికి 2021 అక్టోబర్ 2న నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటించారు. విడాకుల అనంతరం సమంత తన కెరియర్ పై ఫోకస్ పెట్టగా,  నాగచైతన్య మాత్రం శోభితతో రిలేషన్ లో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనికి తోడు వీరిద్దరూ.. యూరప్ వెళ్ళిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఒక వైన్ పార్టీ జరుగుతుండగా అక్కడ కూడా వీరిద్దరూ దర్శనం ఇచ్చారు .దీంతో శోభిత నాగచైతన్య డేటింగ్ లో ఉన్నారంటూ మరొకసారి నిరూపణ అయింది. 

రూమర్స్ ని నిజం చేస్తూ రహస్యంగా.. నాగచైతన్య,  శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు.  నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అతి కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిపించారు నాగార్జున.

ఇదిలా ఉండగా తాజాగా శోభితకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.  ఈమె బాలీవుడ్ హీరో సినిమాలో.. ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. బాలీవుడ్లో డాన్ సిరీస్ కి ఎనలేని క్రేజ్ దక్కింది .మొదటి రెండు భాగాలలో షారుక్ ఖాన్ నటించగా..  మూడవ భాగంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈయన పక్కన శోభిత ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని ఫ్యామిలీకి ఇది భారీ షాక్ అనడంలో సందేహం లేదు. 

ఎందుకంటే గతంలో సమంత కూడా ఐటమ్ సాంగ్ చేసిందననే కారణంగానే నాగచైతన్య విడాకులు.. తీసుకున్నారనే ప్రచారం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో శోభిత ఐటమ్ సాంగ్ లో నటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి శోభిత ఈ ఐటెం సాంగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also read: September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News