Indian Train Late: విశాఖపట్టణం- ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్న ఈ రైలు అదృశ్యమై 3 ఏళ్ల తర్వాత గమ్యస్థానానికి చేరుకుంది.. అసలు విషయం తెలిస్తే..?

Indian Train Late By 3.5 Years: అవును.. సాధారణంగా ఇండియన్‌ రైల్వే అంటేనే ఆలస్యం అవుతుంది. కానీ, జపనీస్‌ లో ఒక్కనిమిషం ఎప్పుడైనా రైలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటే జపనీస్‌ రైల్వే అక్కడి ప్రయాణీకులకు క్షమాపణ చెబుతుంది. విశాఖపట్టణం నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్న ఓ రైలు ఏకంగా డెస్టినేషన్‌ చేరడానికి మూడున్నరేళ్ల సమయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
 

1 /6

భారతీయ రైల్వే రైళ్లు 8 గంటలు-10 గంటలు ఆలస్యంగా రావడం సర్వసాధారణం. అయితే, విశాఖపట్టణం నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్న ఈ రైలు మాత్రం ఏకంగా మూడున్నరేళ్లు డెస్టినేషన్‌ చేరుకోవడానికి ఆలస్యం అయింది.  

2 /6

సాధారణంగా విశాఖపట్టణం నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్లడానికి 42 గంటల 13 నిమిషాలు పడుతుంది. అయితే, ఈ రైలు ఎద్దులబండి కంటే చాలా నెమ్మదిన ప్రయాణించిందో ఏం జరిగిందో కానీ, 2014లో  స్టేషన్ నుండి బయలుదేరి 3.5 ఏళ్ల తర్వాత 2018లో గమ్యస్థానానికి చేరుకుంది.   

3 /6

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ రైలుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే ఈ ఆలస్యానికి కారణాన్ని రైల్వేశాఖ వివరించలేదు నిజానికి చెప్పాలంటే కనుగొనలేకపోయింది.      

4 /6

అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన వ్యాపారి రామచంద్ర గుప్తా ఎరువుల డెలివరీ కోసం రైల్వే గూడ్స్ రైలును బుక్ చేసుకున్నాడు. విశాఖపట్నం నుంచి 1361 ఎరువుల ప్యాకెట్లతో బయలుదేరిన గూడ్స్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి 42 గంటల సమయం పడుతుంది.  

5 /6

దీంతో వ్యాపారవేత్త రామచంద్ర గుప్తా రైల్వేకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు.  రైల్వేశాఖకు తెలిపినా రైల్వేశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విశాఖపట్నం నుంచి బయలుదేరిన గూడ్స్ రైలు ఎక్కడ మాయమైందో ఎవరికీ కనిపెట్టలేకపోయారు. మార్గమధ్యలో రైలు అదృశ్యమైనట్లు గుర్తించారు.   

6 /6

నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ చీఫ్ PRO సంజయ్ యాదవ్ రైలు బోగీలు పాడైపోయినప్పుడు వాటిని యార్డ్‌కు పంపుతారు బహుశా ఈ విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చు అని అంచనా వేశారట. అయితే, సుదీర్ఘంగా మూడున్నరేళ్ల తర్వాత ఎరువులతో కూడిన గూడ్స్ రైలు జూలై 2018లో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఎక్కడ, ఎలా ,ఎందుకు ఆలస్యం అయింది లేదా అదృశ్యమైంది అనే దాని గురించి ఎవరికీ సమాచారం లేదు. అయితే ఈ జాప్యం వల్ల రూ.14 లక్షల విలువైన ఎరువులు వృథాగా పోయాయి.