7 Worst Foods: ఈ ఏడు ఫుడ్స్ తిన్నారంటే అంతే సంగతులు, గుండె నాశనమైనట్టే

మనిషి ప్రాణాలతో ఉండటం అనేది గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనం తెలిసో తెలియకో తినే ఆహార పదార్ధాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడు ఫుడ్స్ తింటే గుండెకు అత్యంత ప్రమాదంలో ఉన్నట్టే.

7 Worst Foods: మనిషి ప్రాణాలతో ఉండటం అనేది గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనం తెలిసో తెలియకో తినే ఆహార పదార్ధాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడు ఫుడ్స్ తింటే గుండెకు అత్యంత ప్రమాదంలో ఉన్నట్టే.

1 /7

ఫ్రైడ్ పదార్ధాలు ఫ్రైడ్ ఆహార పదార్ధాలు ముఖ్యంగా సమోస, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్‌లో శాచ్యురేటెడ్ , ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇవి గుండె ధమనుల్లో ప్లక్ పేరుకునేలా చేస్తుంది. దాంతో గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురౌతాయి. 

2 /7

బేకరీ ఫుడ్స్ కుకీస్, కేక్, పేస్ట్రీ వంటి బేకరీ ఫుడ్స్‌లో షుగర్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. 

3 /7

రెడ్ మీట్ రెడ్ మీట్‌లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికమొత్తంలో ఉంటుంది. గుండె ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. దాంతో గుండె వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. మాంసం తినడం ఇష్టమైతే రెడ్ మీట్ స్థానంలో లీన్ మీట్ ఎంచుకోండి. 

4 /7

షుగర్ డ్రింక్స్ షుగర్ డ్రింక్స్ ముఖ్యంగా సోడా, ఎనర్జీ  డ్రింక్, ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్ వంటి వాటిలో షుగర్ కంటెంట్ అధిగంగా ఉంటుంది. ఇవి శరీరంలో అదనపు కేలరీలకు కారణమౌతాయి. దాంతో స్ఖూలకాయం, టైప్ 2 డయాబెటిస్ సమస్య వస్తుంది. ఈ పరిస్థితి గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం

5 /7

ప్రోసెస్డ్ మీట్ సాసెస్, బేకన్, హాట్ డాగ్ వంటి ప్రోసెస్డ్ మాంసంలో సోడియం ఇతర ప్రిజర్వేటివ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సోడియం ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుుతంది. ఇది గుండె వ్యాధులకు కారణమౌతుంది. అందుకే ఫ్రెష్ మీట్ లేదా ఫ్రెష్ వెజిటబుల్స్ మాత్రమే తినాలి

6 /7

ఫ్రైడ్ పదార్ధాలు ఫ్రైడ్ ఆహార పదార్ధాలు ముఖ్యంగా సమోస, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్‌లో శాచ్యురేటెడ్ , ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇవి గుండె ధమనుల్లో ప్లక్ పేరుకునేలా చేస్తుంది. దాంతో గుండె వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురౌతాయి.

7 /7

మైదా ఉత్పత్తులు మైదాతో తయారుచేసే వైడ్ బ్రెడ్, పాస్తా, బిస్కట్స్ దూరం చేయాలి. వీటిలో ఫైబర్ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ , స్థూలకాయం సమస్య రావచ్చు. గుండె వ్యాధులకు దారి తీస్తుంది.