Good CIBIL Score: సిబిల్ స్కోర్ బాగుందా..అయితే మీకు అతి తక్కువ వడ్డీ రేటుకే లోన్ లభించే చాన్స్ ఎలాగంటే..?

CIBIL Score: సాధారణంగా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా లోన్స్ మంజూరు అవుతాయి. అంతేకాదు వడ్డీ రేటు కూడా సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు ఇస్తుంటాయి. అలాగే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాంకులు, రుణ సంస్థలతో వడ్డీ రేటు విషయంలో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. మరి మీ సిబిల్ స్కోర్ బాగుంటే  అతి తక్కువ వడ్డీరేటుకే లోన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /6

Low Interest Rates With A Good CIBIL Score : బ్యాంకులు లేదా ఇతర రుణదాతలు లోన్స్ ఇచ్చే ముందుకు కచ్చితంగా రుణ గ్రహీత సిబిల్ స్కోరును చెక్ చేస్తాయి. సిబిల్ స్కోర్ బాగుంటేనే తక్కువ వడ్డీతో లోన్స్ ఇస్తాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ అప్లయ్ చేసుకుంటే రిజక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదంటే వడ్డీరేటు ఎక్కువగా విధిస్తారు. అందుకే లోన్స్ సులభంగా, తక్కువ వడ్డీ రేటుతో అప్రూవల్ అవ్వాలంటే సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. అప్పుడే మీరు రుణదాతతో లోన్ వడ్డీ రేటు విషయంలో మాట్లాడుతారు. ఈ క్రమంలో మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.   

2 /6

ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ 750 ఉందనుకుంటే..అతనికి బ్యాంకులు లేదా రుణదాతలు సులభంగా లోన్ ఇస్తాయి. తక్కువ వడ్డీరేటుకే లోన్ ఇస్తాయి. అయితే వడ్డీ రేటు విషయంలో ఆ వ్యక్తి బ్యాంకులతో కూడాచర్చించవచ్చు. అదే రుణగ్రహీత సిబిల్ స్కోర్ 500 నుంచి 600 ఉంటే అతనికి లోన్ రావడం కష్టంగా మారుతుంది. లోన్ వచ్చిన రుణ సంస్థలు ఎక్కువ వడ్డీని విధిస్తాయి. వడ్డీ విషయంలో రుణగ్రహీతతో చర్చలు కూడా జరిపే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ ఎక్కువగా లేదు కాబట్టి.   

3 /6

సిబిల్ స్కోర్  రుణసంస్థలతో వడ్డీరేటు గురించి మాట్లాడే ముందు మీ సిబిల్ స్కోర్ ను ఓసారి చెక్ చేసుకోండి. మంచి స్కోర్ ఉంటే మీకు తక్కువ వడ్డీరేటు వస్తుంది. 

4 /6

వడ్డీ రేటు  పలు బ్యాంకులు, రుణ సంస్థలు లోన్ పై విధించే వడ్డీ రేట్ల గురించి మీరు ఓసారి తెలుసుకోవాలి. అది మీరు లోన్ తీసుకోబోయే సంస్థతో వడ్డీ రేటు మాట్లాడే సమయంలో ఉపయోగపడుతుంది.   

5 /6

సిబిల్ హిస్టరీ  వడ్డీ రేటు విషయంలో రుణదాతతో చర్చిస్తున్నప్పుడు మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందని  చెప్పండి. ఎందుకంటే సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ వడ్డీకిలోన్ మంజూరు అవుతుంది.   

6 /6

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు రుణదాతతో వడ్డీరేటుపై చర్చించడానికి వీలుంటుంది. అయితే మీతో చర్చలు జరిపే ఆర్ధిక సంస్తలు కూడా పరిగణించే ఏకైక అంశం సిబిల్ స్కోర్ మాత్రమే కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. మీ ఆదాయం, రుణం, ఉద్యోగ బ్యాక్ గ్రౌండ్, ఇతర ఆర్థిక అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంటారు.  అప్పుడే మీకు తక్కువ వడ్డీరేటుకు లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తారు.