MS Dhoni House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. రాయల్ భవనం.. ఎంఎస్ ధోనీ ఫామ్‌హౌస్ పిక్స్ చూశారా..!

MS Dhoni Farmhouse Inside Pics: టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్‌ రూపంలో ధోనీ ఆటను చూసేందుకు అభిమానులకు ఇంకా అవకాశం మిగిలే ఉంది. ఈ సీజన్‌తో ధోనీ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఇక రాంచీలో ధోనీ అద్భుతమైన ఫామ్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
 

1 /7

రాంచీలో ఉన్న ధోనీ ఫామ్ హౌస్ పేరు ‘కైలాసపతి’. ఈ ఫామ్ హౌస్ ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇండోర్ స్టేడియం, జిమ్ వరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ధోనీ తన కుటుంబంతో ఇక్కడ నివసిస్తున్నాడు.  

2 /7

ఈ ఫామ్ హౌస్ హర్ము రోడ్‌లోని ధోని మొదటి ఇంటి నుంచి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ధోనీకి కాస్త ఖాళీ సమయం దొరికినా.. ఈ ఫామ్‌హౌస్‌లోనే గడుపుతుంటాడు. దాదాపు టీమిండియా క్రికెటర్లందరూ ఇక్కడికి వచ్చి ఫామ్‌హౌస్ అందాలను ఆస్వాదించారు.  

3 /7

కైలాసపతి ఫామ్ హౌస్‌ రాంచీలోని రింగ్ రోడ్‌లో ఉంది. దీనిని నిర్మించడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఇక్కడ అంతా గ్రీనరీగా ఉంటుంది.  

4 /7

ఈ ఫామ్ హౌస్‌ చాలా గ్రాండ్‌గా, రాయల్‌గా ఉంటుంది. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, నెట్ ప్రాక్టీసింగ్ గ్రౌండ్, అల్ట్రా మోడ్రన్ జిమ్ అన్ని ఉన్నాయి.   

5 /7

ముందుగా ధోనీ 2009లో హర్ము రోడ్‌లో మూడు అంతస్తుల ఇంటిని కొనుగోలు చేశాడు. దాదాపు 8 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నాడు. ఆ తరువాత 2017లో కైలాసపతి ఫామ్‌హౌస్‌కి మారాడు.   

6 /7

ఈ ఫామ్ హౌస్‌లో ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంటుంది. రకరకాల చెట్లు, మొక్కలు నాటారు. ఇక్కడే తనకు ఇష్టమైన కార్లు, బైక్‌లను ఉంచాడు.  

7 /7

ధోనీకి ఇష్టమైన పెంపుడు జంతువులు (కుక్కలు) ఇక్కడ ఉన్నాయి. ఈ ఫామ్‌హౌస్‌లో ధోనీ తన పెంపుడు జంతువులకు శిక్షణ కూడా ఇస్తున్నాడు.