Airtel FD: ఎయిర్‌టెల్‌ అదిరిపోయే సరికొత్త ఫిక్సెడ్‌ డిపాజిట్‌.. ఏకంగా 9.1 శాతం వడ్డీ పొందే స్కీమ్‌

Airtel Fixed Deposit Scheme: ప్రముఖ భారతీ ఎయిర్‌ టెల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌, ఎన్‌బీఎఫీసుల భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్‌ ఫైనాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అత్యధికంగా రూ.9.1 శాతం వడ్డీ పొందవచ్చు.   ఆ వివరాలు తెలుసుకుందాం.

1 /5

Airtel Fixed Deposit Scheme: సాధారణంగా ఏ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 7 శాతం అంతకు మించి సీనియర్‌ సిటిజెన్లకు అందిస్తున్నట్లు తెలుసు. కొన్ని ప్రభుత్వ రంగ పథకాల్లో 8 శాతం లోపే అందిస్తున్నాయి. కానీ, భారతీ ఎయిర్‌ టెల్‌ ఇప్పటి వరకు ఎవరూ అందించని ఫిక్సెడ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ ద్వారా ఏకంగా 9.1 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.  

2 /5

ప్రముఖ భారతీ ఎయిర్‌ టెల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌, ఎన్‌బీఎఫీసుల భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్‌ ఫైనాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అత్యధికంగా రూ.9.1 శాతం వడ్డీ పొందవచ్చు.  ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపింది.  

3 /5

ఈ నేపథ్యంలో ఎయిర్‌ టెల్‌ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఏ బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ ఎయిర్‌ టెల్‌ థ్యాంక్స్ యాప్‌ ద్వారా ఎఫ్‌డీ బుక్‌ చేయవచ్చు. మీరు డిపాజిట్‌ డబ్బులు మీ అవసరాల నిమిత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. లాక్‌ ఇన్‌ భయం లేదు.  

4 /5

ఎయిర్‌ టెల్‌ ఈ ఫిక్సెడ్‌ డిపాజిట్‌ ను ఉత్కర్ష్‌స్మాల్‌ ఫైనాన్స్‌, శివాలిక్‌ బ్యాంక్‌, సూర్యోదయ బ్యాంక్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలతో ఎయిర్‌టెల్‌ జతకట్టి ఈ అధిక వడ్డీరేటు అందించే డిజిటల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రారంభిస్తోంది.  

5 /5

భారతీ ఎయిర్‌ టెల్‌ త్వరలో వ్యాపార రుణాలు, సెక్యూర్డ్‌ రుణాలను కూడా అందించనుంది. ఇప్పటికే ఎయిర్‌ టెల్‌ ఫైనాన్స్‌, ఫ్లెక్సీ పర్సనల్‌ లోన్స్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా బ్యాంకుల్లో మనం ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేసేది అధిక డబ్బులు పొందవచ్చని. ఈ నేపథ్యంలో ఎయిర్‌ టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం వచ్చింది.