School Holiday Cancel: ఆరోజు స్కూళ్లకు సెలవు క్యాన్షిల్.. నాలుగు రోజుల సెలవుల్లో బిగ్ ట్విస్ట్.. కారణం ఏంటంటే..?

School holiday news: గత కొన్నిరోజులుగా వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు స్కూళ్లకు హలీడేలు ప్రకటిస్తు వస్తున్నాయి. 
 

1 /6

కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా నష్టం వాటిల్లింది.  ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు.

2 /6

ఇప్పటికి కూడా కొన్నిప్రాంతాలు ఇంకా వరద ముప్పులోనే ఉన్నాయి. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ వరద ముంపుకు గురైనట్లు తెలుస్తోంది. రెండు స్టేట్స్ ల సీఎం లు.. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సైతం.. రంగంలోకి దిగి అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.

3 /6

వరద ముంపు ప్రభావితమైన ప్రజలకు సహాయం అందిస్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా తన వంతుగా అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజులుగా భారీ వానల వల్ల అనేక సందర్భాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో స్కూళ్లలో సిలబస్ కాక.. టీచర్ లు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

4 /6

మరోవైపు..సెప్టెంబర్ 14 రెండో శనివారం, తదుపరి ఆదివారం, ఇలా రెండు రోజులు వచ్చాయి. మరల సెప్టెంబరు 16 న మిలాద్ ఉన్న నబీ కాబట్టి.. ఆ రోజు కూడా సెలవు ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17 న నిమజ్జనం ఆరోజు..ఎలాగైన హలీడే ఉంటుంది. ఈ నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ పండుగను.. 16 కు కాకుండా.. 17 వ తేదీన జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 

5 /6

దీంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సిలబస్ ను అవ్వట్లేదు కనుక.. 16 వ తేదీన ఉన్న స్కూళ్ల హలీడేను క్యాన్షిల్ చేసింది. ఆ రోజు యథాప్రకారం స్కూళ్లు నడుస్తాయని కూడా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా సెలవులు రావడంతో చాలా మంది అనేక ప్లాన్ లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

6 /6

కానీ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయంతో మాత్రం.. వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడినట్లు సమాచారం. మరోవైపు వాతావరణ కేంద్రం.. రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా మరల వరుణుడి గండం ఉందని కూడా హెచ్చరించింది.