Soaked Chickpeas Benefits: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఆహారాలు డైట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఈ డైట్‌లో భాగంగానే ప్రూట్స్‌తో పాటు నానబెట్టిన మొలకలు తింటున్నారు. ముఖ్యంగా మంది పెసల్లతో పాటు శనగలు తింటున్నారు. వీటి రెండింటిలో శనగలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కామ్ప్లెక్స్ వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు నానబెట్టిన శనగలు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
నానబెట్టిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు మలబద్ధకం నుంచి విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందేకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన రేడికల్స్‌ను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎముకలను దృఢత్వం కోసం:
నానబెట్టిన శనగల్లో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఎలాంటి ఎముకల సమస్యలైనా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
గుండె ఆరోగ్యానికి మంచిది:
శనగల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఇవి శక్తిని పెంచేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
రక్తహీనతను నివారిస్తుంది:
శనగల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. ఇది రక్తహీనతను నివారించేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.