Hansika: హన్సికలో సడెన్ గా వచ్చిన ఈ మార్పును గమనించారా.. !

Hansika: హన్సిక మోత్వానీ.. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా సత్తా చాటింది. తెలుగులో  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు  పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడి ఆడియన్స్  చేత గుడి  కట్టించుకునే  రేంజ్ కు ఎదిగింది హన్సిక. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో పాటు హాట్ ఫోటో షూట్స్ తో  అదరగొడుతోంది.

1 /5

హన్సిక.. తెలుగు ఆడియన్స్  ఈమెను బొద్దు గుమ్మగా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఆ అందాలతోనే తమిళ తంబీల ఆరాధ్య కథానాయికగా మారింది. ఏకంగా వాళ్ల చేత  గుడి కట్టించే రేంజ్ ఎదిగింది.

2 /5

తెలుగులో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన నటించిన హన్సిక.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘కంత్రి’ మూవీతో పలకరించింది. తారక్, అల్లు అర్జున్ తర్వాత మరె పెద్ద హీరోలెవరు ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం హన్సికను  నెత్తిన పెట్టుకుంది.  

3 /5

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అప్పట్లో హన్సిక తన పెళ్లి కోసం ఏకంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూసాయి. 2007లో హీరోయిన్ గా పరిచయమై ఇప్పటికీ కథానాయికగా అలరిస్తూనే ఉన్నాయి. 

4 /5

హన్సిక చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ హల్ చల్ చేయడం హన్సిక మార్క్ స్టైల్ అని చెప్పాలి. తాజాగా సన్నబడి నాజుగ్గా తయారైంది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

5 /5

హన్సిక 1991 ఆగష్టు 9న ముంబైలో జన్మించింది. ముందుగా బాలనటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా సత్తా చూపెడుతుంది.