Krithi Shetty: పాలకోవలా అభిమానులను ఊరిస్తోన్న కృతి శెట్టి.. బేబమ్మ ఫోటో షూట్ కు సోషల్ మీడియాలో వైరల్..

Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు తెరపై ‘ఉప్పెన’లా  ఎగిసిపడిన అందా సోయగం.  ఫస్ట్ మూవీతోనే   ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘మనమే’ మూవీతో పలకరించి మంచి హిట్ అందుకుంది. తాజాగా మరోసారి పాలకోవల ఊరిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

1 /6

కృతి శెట్టి  ఫస్ట్ మూడు చిత్రాల వరుస  సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుపసగా డిజాస్టర్స్  ఈ అమ్మడి క్రేజ్ కు  బ్రేకులు వేసాయి. రీసెంట్ గా ‘మనమే’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

2 /6

  కృతి శెట్టి.. ‘ఉప్పెన’'శ్యామ్ సింగరాయ్', ‘బంగార్రాజు’ వంటి  వరుస మూడు  హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో  హాట్ బేబ్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా తలకిందులైంది. 

3 /6

కృతి శెట్టి కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులున్నాయి ఈ అమ్మడి కెరీర్ లో.  వరుసగా వచ్చిన చిత్రాలు వచ్చినట్టు ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్‌ డౌన్ ఫాల్ మొదలైంది.

4 /6

మెగా మేనల్లుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన'మూవీతో  హీరోయిన్‌గా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది బేబమ్మ.    

5 /6

ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా నడవకపోవడంతో  అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

6 /6

రీసెంట్ గా శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమాతో పర్వాలేదనిపించింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు సినిమాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.