Pitru paksha 2024: పితృ పక్షంను పూర్వీకుల పేరు మీదుగా నిర్వహిస్తారు. ముఖ్యంగా..సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా పితృ పక్షం ను జరుపుకుంటారు. ఈ కాలంలో పూర్వీకుల కోసం శ్రాధ్దకర్మాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చనిపోయిన మన పూర్వీకులు పితృ పక్షంలో తప్పకుండా భూమి మీదకు వస్తారని చెబుతుంటారు. అందుక ఈ పదిహేను రోజులు పాటు ప్రత్యేకంగా శ్రాధ్దకర్మాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని వల్ల మన పూర్వీకులు సంతోషిస్తారని చెబుతుంటారు.
మనం 365 రోజులు భోజనం చేస్తుంటా. అదే విధంగా చనిపోయిన మన పూర్వీకులకు.. ఒక్కరోజు అంటే..పితృ పక్షంలో మనం ఏదైన వారికి సమర్పించుకుంటామో.. అది ఏడాదంతా అన్నం పెట్టిన పుణ్యం వస్తుందంట. అందుకే హిందు పురాణాల ప్రకారం.. పితృ పక్షలకు అంతటి గొప్పతనం ఉందని చెప్పుకొవచ్చు.
ముఖ్యంగా పితృ పక్షలలో కొన్ని పదార్ధాలను అస్సలు తినకూడదు. ఈ పదిహేను రోజుల పాటు మనం చేసే ప్రతి కార్యక్రమంలో.. పూజలు, కర్మలు కూడా.. పూర్వీకులకు చెందుతాయని చెబుతుంటారు. అందుకు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉంటూ.. శ్రాద్ధకర్మలను భక్తితో చేయాలి పండితులు చెబుతుంటారు.
పితృ పక్షంలలో.. మాంసాహారంలకు దూరంగా ఉండాలి. చెపలు,ఇతర అన్నిరకాల పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం సేవించరాదు. దీనితో పాటుగా, వెల్లిపాయ, ఉల్లగడ్డల్ని కూడా తినొద్దని పండితులు చెబుతుంటారు. దీని వల్ల మన శరీరంలో తామస గుణాలు వస్తాయని చెబుతుంటారు. అందుకేఈ పదార్థాలకు దూరంగా ఉండాలి.
అదే విధంగా ఆకుకూరలు,వంకాయలను కూడా తినొద్దని చెబుతుంటారు. దోసకాయలను కూడా తినద్దంటూ. అధికంగా కారం, ఉప్పుపదార్థాలను సైతం ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. కేవలం సాత్వికమైన ఆహారం తీసుకుంటూ,పూర్వీకులను తలచుకుంటూ శ్రాద్దకర్మది కార్యక్రమాలు నిర్వహించాలి.
ముఖ్యంగా పితృ పక్షంలో కాకికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మనం చేసిన శ్రాధ్దంలోని పిండాలను కాకి ముట్టుకుంటే.. చనిపొయిన మన పూర్వీలకు ఆనంద పడ్డారని కూడా చెబుతుంటారు. అందుకే పిండాలని కాకి తాకాలని చెబుతుంటారు.
ఒక వేళ కాకి కన్పించకుంటే.. మాత్రం ప్రవహించే నదిలో.. ఆవుకుకానీ తినేందుకు పెట్టవచ్చు. చాలా మంది ఇళ్లలో పెళ్లిళ్ల సమస్యలు,లైఫ్ సెటిల్ మెంట్ సరిగ్గా లేకపోవడం, జీవితంలో సరిగ్గా ఉన్నతి ఉండదు.దీనికి పూర్వీకుల శాపంగా చెప్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)