Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!

Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. కానీ, గత రెండు రోజులుగా ఈ పవిత్ర ప్రసాదంలో గొడ్డు మాంసానికి చెందిన పదార్థాలు, చేపనూనె కలుపుతున్నారనే వివాదం మరింత ముదురుతోంది.
 

1 /8

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా పోటు (వంటగది)లో తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఈ లడ్డూను పరమ పవిత్రంగా ప్రత్యక్ష వేంకటేషునిలా భావిస్తారు. ఈ లడ్డూ తయారీ ప్రక్రియను దిట్టం అని పిలుస్తారు. అంటే ఏ వస్తువులు లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్నారు? ఎంత పరిమాణం ఉపయోగించాలి?  

2 /8

అయితే, ప్రస్తుతం తిరుమల శ్రీనివాసుని ఆలయంలో తయారు చేసే లడ్డూ ప్రసాదం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె వాడారని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ విషయం తెలిసి ఉలిక్కిపడ్డారు.దీనికి సంబంధించిన ల్యాబ్‌ టెస్ట్‌ కూడా నిర్వహించారు. అందులోనే లడ్డూ ప్రసాదం తయారీలో ఏ వస్తువులను ఉపయోగించారో తేలింది.  

3 /8

ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం తిరుమల శ్రీ వేంకటేశుని సన్నిధిలో తయారు చేస్తారు. ఇది తిరుమల దర్శించుకున్న భక్తులకు విక్రయిస్తోంది. దీని వల్ల టీటీడీకి ఏటా రూ.500 కోట్ల ఆదాయం గడిస్తోంది.  

4 /8

తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీ 1715 సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే దాదాపు 300 ఏళ్లు పైబడింది. ఇన్ని ఏళ్లలో కేవలం ఆరు సార్లు మాత్రమే లడ్డూ తయారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. 2014 వ సంవత్సరం ఈ పవిత్రమైన లడ్డూకు జీఐ హోదా కూడా కల్పించారు.  

5 /8

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీని అత్యాధునిక ఆహార పరీక్ష ప్రయోగశాల నాణ్యతను పరీక్షిస్తుంది. ఈ లడ్డూ ప్రసాదం తయారీలో ముఖ్యంగా చక్కెర, యాలకులు, జీడిపప్పు కూడా మన్నికగా సరైన పరిమాణంలో ఉండాలి. లడ్డూ బరువు దాదాపు 175 గ్రాములు ఉంటుంది. అందుకే ఈ ప్రసాదం అంత రుచిగా కూడా ఉంటుంది.  

6 /8

2016 నివేదిక ప్రకారం లడ్డూలు ఎక్కువ కాలంపాటు మన్నికగా ఉండటానికి శనగపిండితో బుందీ తయారు చేస్తారు. బెల్లంతో పాణకం తయారు చేస్తారు. ఆ తర్వాత జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలు కలుపుతారు.  

7 /8

అయితే,  జూలైలోనే ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సరఫరా చేస్తోన్న నెయ్యిలో జంతు కొవ్వు కూడా ఉందని గుర్తించిన అధికారులు వెంటనే ఆ సరఫరాదారుని బ్లాక్‌లిస్టులో పెట్టింది. ప్రస్తుతం కర్నాటకకు చెందిన కాంట్రాక్టర్‌ నుంచి రూ.475 కిలో నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ కిలో నెయ్యికి కేవలం రూ.320 మాత్రమే విక్రయించేది.  

8 /8

గురువారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాబ్‌ టెస్ట్‌ రిపోర్టులో గొడ్డుమాంసానికి సంబంధించిన పదార్థాలు, పందికొవ్వు, చేపనూనెను వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ హయాంలో సరఫరా జరిగినట్లు వెల్లడించారు. అంతేకాదు లడ్డూలో కొబ్బరి, అవిసెగింజలు, పత్తి గింజల మొక్కల మూలాలను కూడా గుర్తించారు. అయితే, టీడీపీ ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ జే శ్యామలారావును టీటీడీ కొత్త ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌గా నియమించింది. ఈయన ప్రస్తుతం ఈ వివాదంపై విచారణకు కూడా ఆదేశించారు.