Small Business Idea: దీపావళికి ముందే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. ఇంట్లో ఉండే నెలకి 3 లక్షల సంపాదించవచ్చు!

2024 Small Business Idea: ప్రస్తుత కాలంలో చాలా మంది జాబ్ చేస్తూ సైడ్ బిజినెస్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇందులో వచ్చే ఆదాయం అధికంగా  ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక లాభాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత, వృద్ధి, అలాగే కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఎలాంటి బిజినెస్‌ను మొదలు పెట్టాలి ? ఎంత ఖర్చు అవుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ సైడ్‌ బిజినెస్‌ గురించి తెలుస్తే మీరు ఎగిరి గంతులు వేస్తారు.
 

1 /12

సైడ్ బిజినెస్ చేయడం వల్ల క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ఇందులో మనమే బాస్ గా కూడా వ్యవహరించవచ్చు. మనం ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. అలాగే నెలవారి జీవితం కోసం ఎదురుచూస్తూ గడపాల్సిన అవసరం ఉండదు. 

2 /12

అయితే మీరు కూడా దీపావళి లోపు ఏదైనా ఒక కొత్త సైడ్ బిజినెస్ ని ప్రారంభించాలనుకుంటున్నారా.. కానీ ఏ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. జాబ్‌ చేస్తూ కూడా ఈ బిజినెస్‌ను రన్‌ చేయవచ్చు. 

3 /12

ఇంతకీ ఆ వ్యాపారం ఏంటి ? ఎలా స్టార్ట్ చేయాలి? దీని వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ బిజినెస్‌ను ప్రారంభించడానికి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. అది ఎలా పొందాలి అనే తెలుసుకుందాం. 

4 /12

ఈ సైడ్ బిజినెస్ ఎంతో  సింపుల్. తక్కువ సమయంలోనే  భారీ ఆదాయాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే '' పఫ్డ్  రైస్ " తో సాధ్యమవుతుంది. అవును మీరు వినది నిజమే.. దీంతో ఇంట్లోనే సులువుగా ఆదాయం పొందుతారు. ఎలాంటి భారీ ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు. 

5 /12

పఫ్డ్ రైస్  అనేది ఆంగ్ల పదం. దీన్ని మన తెలుగు వారు (Murmura) ముర్మురాలు  అని కూడా  పిలుస్తారు. వీటిని పశ్చిమబెంగాల్,  బీహార్,  జార్ఖండ్ వంటి ప్రాంతాలలో ఝల్ మురి అని పిలుస్తారు. ఇవి ఎంతో రుచికరమైనవి. ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 

6 /12

ముర్మురాలను పిల్లల నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ముర్మురాలతో వివిధ రకాల రెసిపీలు తయారు చేస్తారు. ముఖ్యంగా వీటితో స్ట్రీట్‌ స్టైల్‌ ఫుడ్స్ బిజినెస్‌ పెడుతే అదిరిపోయే లాభాలు కలుగుతాయి. ఈ బిజినెస్‌ ను ఎంతో సులభంగా స్టార్ట్‌ చేయవచ్చు. 

7 /12

ఇది చిన్న పెట్టు బడితో  ప్రారంభించే బిజినెస్. అంతేకాకుండా ఇది ఆరోగ్య ప్రజ్ఞను కలిగి ఉన్నవారు దీని స్టార్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందవచ్చు. ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. 

8 /12

ఈ పఫ్డ్  రైస్ తో వివిధ రకాల స్నాక్స్ ను తయారు చేసి జిమ్, స్కూళ్లు, ఆన్లైన్ లో వంటి వాటిలో అమ్మవచ్చు.  ఈ బిజినెస్‌ కేవలం ఆదాయం మాత్రమే కాకుండా కొత్త నైపుణ్యాలను కూడా పెంచుతుంది.   

9 /12

 ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, దీని వల్ల  ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.  అయితే పఫ్డ్  రైస్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి ? 

10 /12

బిజినెస్ స్టార్ట్ చేయడానికి రూ. 3.55 లక్షలు ఖర్చవుతుంది. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే ప్రధానమంత్రి ముద్ర లోన్ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు.  దీంతో పఫ్డ్  రైస్ తయారు చేసే మెషిన్‌లు, ప్యాకింగ్ మెటీరియల్స్ కోసం సహాయపడుతుంది.

11 /12

పఫ్డ్ రైస్  ప్రతి మారుమూల ప్రాంతాల్లో మనకు అందుబాటులో ఉంటుంది.  కాబట్టి ఏదైనా హోల్సేల్ మార్కెట్ నుంచి ఫస్ట్ రైస్ ను కొనుగోలు చేయవచ్చు. అలాగే బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చే లైసెన్సులు, పర్మిట్లు ను పొందాల్సి ఉంటుంది.  

12 /12

ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆహార లైసెన్స్ ని తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా ప్యాకేజింగ్ లో బ్రాండ్ పేరు ఉండేలా చూసుకోవాలిసి ఉంటుంది. వీలైతే చిన్న చిన్న స్టోర్లకు సప్లై చేయడం వల్ల దీన్ని ఇతరులకు కూడా ఈ బ్రాండ్‌ తెలుస్తుంది.  బిజినెస్ విక్రయాలు పెరగడానికి కూడా ఉపయోగం పడుతుంది.