FIR Filed Against YouTuber Harsha Sai In Narsingi PS: పేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న హర్షసాయికి భారీ షాక్ తగిలింది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. వాటి వివరాలు తెలుసుకోండి.
Harsha Sai Case: ప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డాననే వార్తలు గుప్పుమన్నాయి.
Harsha Sai Case: సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన డబ్బును పేదవారికి పంచుతూ సోషల్ మీడియాలో స్టార్‌గా హర్షసాయి ఎదిగాడు.
Harsha Sai Case: అయితే అతడు తనను మోసం చేశాడని ఓ యువతి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Harsha Sai Case: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
Harsha Sai Case: ఫిర్యాదుదారు ఎవరో కాదు బిగ్‌బాస్ ఫేమ్ మిత్ర శర్మ.
Harsha Sai Case: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. ఇప్పుడు మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
Harsha Sai Case: రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడని కూడా ఫిర్యాదుపత్రంలో పేర్కొంది.
Harsha Sai Case: ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.