Kavitha: రేపటి నుంచి బతుకమ్మ పండుగ.. ఈ సారి కవితక్క బతుకమ్మకు దూరమైనట్లేనా..?

Batukamma festival 2024: తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను పది రోజుల పాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Oct 1, 2024, 01:07 PM IST
  • తెలంగాణలో బతుకమ్మ సంబరాలు..
  • ఆస్పత్రిలో అడ్మిట్ అయిన కవిత..
Kavitha: రేపటి నుంచి బతుకమ్మ పండుగ.. ఈ సారి కవితక్క బతుకమ్మకు దూరమైనట్లేనా..?

Big twist on Kavitha participated in batukamma festival: తెలంగాణ వ్యాప్తంగా  పల్లే, పట్నం తేడా లేకుండా బతుకమ్మ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. మెయిన్ గా ఇది మన తెలంగాణ ఆడపిల్లల..సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన పండుగగా చెప్పుకుంటారు. ముఖ్యంగా బతుకమ్మను పదిరోజులు పాటు రోజుకోక పేరుతో నిర్వహిస్తారు. ప్రత్యేకంగా డెకోరేషన్ చేసి,  ఆడపిల్లలు,ముత్తైదువలు బతుకమ్మ చుట్టు ప్రత్యేకంగా తిరుగుతూ తమ సంప్రదాయం చాటుకుంటారు.

ఇదిలా ఉండగా..తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గత 15ఏళ్లుగా బతుకమ్మ ఉత్సవానలు నిర్వహిస్తారు. ఆమె ప్ర‌తిసారి తెలంగాణ‌వ్యాప్తంగా జాగృతి త‌ర‌పున ఉత్స‌వాలు చేస్తుంటారు. అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నిధులు కూడా జారీ చేసేది. ఇదిలా ఉండగా.. గతంలో నిజామాబాద్ ఎంపీగా కలిత గెలిచిన తర్వాత ఎక్కడ బతుకమ్మలు జరిగిన కవిత అక్కడికి వెళ్లేవారు.

కవిత అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే కవిత అన్నట్లుగా బ్రాండ్ పడిపోయిందని చెప్పుకొవచ్చు. ఆమె పదిరోజుల పాటు బతుకమ్మ వేడుకల్లో ఫుల్ జోష్ గా పాల్గొనేవారు. దాదాపు పదిహేనండ్ల క్రితం జాగృతిని ఏర్పాటు చేసిన కవిత అప్పటి నుంచి ప్రతి ఏడా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తు వస్తున్నారు. కానీ అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత.. దాదాపు ఐదు నెలల పాటు తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత విడుదలయ్యారు.

కానీ అందరు అనుకున్నట్లుగా కాకుండా... బెయిల్ పై వచ్చిన తర్వాత కవిత చాలా సైలేంట్ అయినట్లు తెలుస్తోంది. తీహార్ జైలులో ఉండగా..  గైనిక్ సమస్యలతో కవిత ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. ఈ రోజు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రాంభమయ్యే బతుకమ్మ పండుగలకు మాత్రం కవిత దూరమయ్యారని వార్తలు విన్పిస్తున్నాయి.

Read more: Bathukamma Festival: బతుకమ్మ పండగ స్పెషల్.. ఈ ఇయర్ బతుకమ్మ పండుగ తేదీలు ఇవే..

దీనిపై ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ మాత్రం  ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ కవిత బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటే.. కాంగ్రెస్ తోపాటు, బీజేపీ వాళ్లు కూడా విమర్శలు చేయోచ్చని తెలుస్తోంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ అందుకే కవిత దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News