Herione: ముగ్గురితో విడాకులు తీసుకున్న హీరోయిన్.. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధం..!

Vanitha Vijay Kumar wedding: సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయిన నటి వనిత విజయ్ కుమార్ మరొకసారి వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇప్పటిదాకా మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న వనిత.. ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు. త్వరలో ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు.. వనిత విజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

1 /5

తమిళ్లో పలు సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్.. తెలుగులో దేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న వనిత కేవలం తన వ్యక్తిగత జీవితం కారణంగా మాత్రమే వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన వనిత.. కుటుంబ తగాదాల కారణంగా కూడా వార్తల్లో నిలిచారు. 

2 /5

తాజాగా మరొకసారి వనిత పేరు వార్తల్లో మారు మ్రోగుతోంది. వనిత విజయ్ కుమార్ ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వనిత నాలుగవ పెళ్లికి సిద్ధం అయ్యారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వనిత విజయ్ కుమార్ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు అయిన రాబర్ట్ రాజ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 5న వీరి పెళ్లి జరగనుంది.

3 /5

బిగ్ బాస్ తమిళ్ ఆరవ సీజన్ తో రాబర్ట్ రాజ్ పాపులర్ అయ్యారు. అతని నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక ఫోటోని షేర్ చేసి ప్రకటించారు వనిత. సముద్రపు ఒడ్డున.. రాబర్ట్ రాజ్ ముందు.. మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేస్తూ.. వనిత విజయ్ కుమార్ కనిపించారు. ఇద్దరూ తెలుపు రంగు బట్టలు వేసుకొని ఫోటోలకి పోజ్ ఇచ్చారు.

4 /5

2000 లో వనిత విజయ్ కుమార్ ఆకాష్ అనే నటుడిని పెళ్లి చేసుకున్నారు. అతనితో ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. కానీ 2005లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2007లో వనిత.. ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా పుట్టింది. కానీ దురదృష్టవశాత్తు 2012లో అతనితో కూడా విడాకులు తీసుకున్నారు వనిత. 

5 /5

రెండవ విడాకులు తీసుకున్న తర్వాత.. కొంతకాలం వనిత రాబర్ట్ రాజ్ తో డేటింగ్ చేశారు. కానీ 2017 లో బ్రేకప్ అయ్యాక.. 2020లో పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పీటర్ కి పెళ్లయింది కానీ ఇంకా అధికారికంగా విడాకులు రాలేదు. దీంతో వీళ్ళిద్దరి పెళ్లి పెద్ద వివాదంగా మారింది. ఏడాది కూడా తిరగకుండానే అతనితో కూడా విడిపోయిన వనిత ఇప్పుడు మళ్లీ రాబర్ట్ రాజ్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.