Top Small Business Idea 2024: కొబ్బరి చిప్పలతో బిజినెస్‌.. శ్రమ లేకుండానే నెలకు రూ.1 లక్ష సంపాదన!

Coconut Shell Charcoal Business: చాలామంది పెద్ద వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చనే భావనను కలిగి ఉంటారు. అయితే ఇది నిజం కాదు. పెద్ద వ్యాపారాలు స్టార్ట్‌ చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి. అలాగే ఎక్కువ సమయం, శ్రమ అవసరం. బిజినెస్‌ నిపుణుల ప్రకారం ఎల్లప్పుడు తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించాలి. దీని వల్ల అతి తక్కువ సమయంలో భారీ లాభాలు పొందవచ్చు. 

Coconut Shell Charcoal Business: సాధారణంగా కొబ్బరి బిజినెస్‌లకు భారీ లాభాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందని చాలా మందికి తెలియదు. దీనికి కారణం దీని విస్తృత ఉపయోగాలు. అంతేకాకుండా ఇది పర్యావరణానికి హానిచేయని ఒక అద్భుతమైన ఉత్పత్తి. కొబ్బరి బొగ్గు వ్యాపారం అంటే కొబ్బరి చిప్పల నుంచి బొగ్గును తయారు చేసి వివిధ రంగాలకు అమ్ముతారు. ఈ బొగ్గును తయారు చేయడానికి ప్రత్యేకమైన పద్ధతులు ఉపయోగిస్తారు. ఈ వ్యాపారంతో  లక్షలు సంపాదించవచ్చు. అయితే మీరు ఈ బిజినెస్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్‌ ప్లాన్‌ మీకోసం.. 
 

1 /8

చాలా మంది కొబ్బరి పెంకులను వృథాగా పారేస్తుటారు. నీజానికి ఇవి వృథాగా వెళ్లిపోయే వ్యర్థాలు కావు. వీటితో విధ రకాల ఉత్పత్తులను తయారు చేసి లక్షల్లో ఆదాయం పొందవచ్చు. కొబ్బరి పెంకులతో చేయగలిగే వ్యాపారాల గురించి వివరంగా తెలుసుకుందాం.  

2 /8

కొబ్బరి పెంకులను బొగ్గుగా మార్చి విక్రయించవచ్చు. ఈ వ్యాపారం ప్రస్తుతం ఎంతో ప్రాచుర్యం పొందుతున్నది. అంతేకాకుడా ఇంధన అవసరాలను తీర్చడంలో కూడా ఉపయోగపడుతుంది.

3 /8

ముందుగా కొబ్బరి పెంకులను సేకరించాలి లాదా వీటిని స్థానిక మార్కెట్లలో లేదా కొబ్బరి తోటల నుంచి సేకరించవచ్చు.  బొగ్గు తయారీకి తగినంత స్థలం అవసరం. ఈ స్థలం పారిశ్రామిక ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతంలో ఉంటే  పెట్టుబడి ఖర్చు కొంత తగ్గుతుంది.

4 /8

కొబ్బరి బొగ్గును తయారు చేయడానికి ప్రత్యేకమైన యంత్రం అవసరం. వీటి ధర రూ. 50,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటుంది. పెద్ద పరిశ్రమల కోసం ఉపయోగించే యంత్రాల ధరలు రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.  

5 /8

ఈ బొగ్గు యంత్రాల కోసం ముద్రా లోన్ పథకం నుంచి సహాయం పొందవచ్చు.  ముద్రా లోన్ పథకం కింద రూ. 50,000 నుంచి రూ. 10 లక్షల వరకు లోన్‌లు అందుబాటులో ఉంటాయి.

6 /8

ఈ వ్యాపారాన్ని నమోదు చేయడానికి అవసరమైన అన్ని లైసెన్స్‌లు పొందాలి. ఆ తరువాత తయారైన బొగ్గును విక్రయించడానికి మంచి మార్కెటింగ్ వ్యూహం అవసరం.

7 /8

 కొబ్బరి పెంకుల బొగ్గు ప్రస్తుతం కేజీ రూ. 50 నుంచి రూ. 70 లభిస్తోంది. నెలకు 1000 కిలోల బొగ్గును తయారు చేయగలిగితే రూ. 60,000 నుంచి 30,000 వరకు లాభం పొందవచ్చు. 

8 /8

కొబ్బరి బొగ్గుకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి  లక్షల్లో ఆదాయం కూడా సంపాదించవచ్చు. ఈ బొగ్గుతో ప్రోడెక్ట్స్‌ను కూడా అమ్ముకోవచ్చు.