Modi government's bumper scheme: పాడి రైతుకు కేంద్రంలోని మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పశులోన్ యోజన స్కీం కింద మొదటిసారి పాడి రైతులకు రూ. 2లక్షల వరకు లోన్ అందిస్తుంది. పశువులను కొనుగోలు చేసేందుకు, పశుగ్రాం తయారు చేసేందుకు, పశువులకు షెల్టర్ వేసేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
Pashu Loan Yojana: రైతే రాజు. వ్యవసాయం దేశానికి వెన్నుముక వంటిది. పారి పరిశ్రమ, వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న కుటుంబాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టేది రైతే. కాబట్టి రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమాభివ్రుద్ధి స్కీములను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమను మరింత విస్తరించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తోంది. దీనిలో భాగంగానే పశులోన్ యోజన స్కీంను ప్రవేశపెట్టేందుకు పాడి రైతులకు తక్కువ వడ్డీతో లోన్లను మంజూరు చేస్తోంది. లబ్దిదారులకు 90శాతం సబ్సిడీతో కేంద్రం లోన్లను కూడా అందిస్తోంది.
పశులోన్ స్కీం యోజన కింద తొలిసారిగా పాడి రైతులకు రూ. 2లక్షల వరకు లోన్ అందిస్తుంది. పశువులను కొనుగోలు చేసేందుకు, పశుగ్రాసం తయారు చేసేందుకు, పశువులకు షెల్టర్ వేసేందుకు, దాణా, ఇతర ఖర్చుల కోసం ఈ స్కీమ్ కింద ఆర్థిక భరోసా కల్పిస్తోంది ప్రభుత్వం. దేశంలోని మారుమూల ప్రాంతాల రైతులు లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతో బ్యాంకుల ద్వారా ఈ స్కీమును అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ స్కీం కింద పాడిరైతులకు లోన్స్ ఇస్తున్నాయి. ఈ లోన్ పశువులను సంఖ్యను బట్టి అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక గేదేకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 80వేల వరకు, ఆవుకు రూ. 60వేల వరకు రుణం ఇస్తోంది. అంతేకాదు బ్యాంక్ ఆఫ్ బరోడా కిసాన్ క్రెడిట్ కార్డు కింద రూ. 10లక్షల వరకు లోన్ మంజూరు చేస్తోంది.
ఇక ఈ పథకం ప్రయోజనం పొందాలంటే..రైతులకు ఏడాదికోసారి వర్తిస్తుంది. ఒకసారి లోన్ తీసుకుంటే ఎలాంటి పెనాల్టీలు లేకుండా నిర్ణిత సమయంలో రీపేమెంట్ చేస్తే లోన్ లిమిట్ పెరుగుతుంది. పాడిరైతులు కచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి.
ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డు, రెసిడెన్సి, ఇన్కమ్ , క్యాస్ట్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ తోపాటు బ్యాంకు అడిగే డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
మీరు కూడా ఈ లోన్ తీసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకోండి. అప్లికేషన్ ఫారం తీసుకుని అందులో పేర్కొన్న సమాచారాన్ని నింపి..దీనికి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి అధికారులకు సమర్పించాలి. బ్యాంకు మేనేజర్ మీ దరఖాస్తును వెరిఫై చేసిన అనంతరం మీకు అర్హతలు ఉన్నట్లయితే లోన్ వెంటనే మంజూరు చేస్తారు.