Samsaptak Rajayogam: అక్టోబర్ 13 నుంచి ఈ 4 రాశులకు మహర్జాతకం పట్టనుందా

హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుంటాయి. దాంతో రాజయోగం ఏర్పడి వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. అదే విధంగా గురు శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడనున్న సంసప్తక రాజయోగం ఈ 4 రాశులకు దశ మార్చేయనుంది. పట్టిందల్లా బంగారం కానుంది.

Samsaptak Rajayogam impact in telugu: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుంటాయి. దాంతో రాజయోగం ఏర్పడి వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. అదే విధంగా గురు శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడనున్న సంసప్తక రాజయోగం ఈ 4 రాశులకు దశ మార్చేయనుంది. పట్టిందల్లా బంగారం కానుంది.
 

1 /5

మకర రాశి మకర రాశి జాతకులకు ప్రతి రంగంలో విజయం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులు రాణిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జించడమే కాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనారోగ్య సమస్యలుంటే దూరమౌతాయి. పెట్టుబడులకు మంచి సమయం. 

2 /5

ధనస్సు రాశి ధనస్సు రాశి జాతకులకు సంసప్తక రాజయోగం చాలా లాభదాయకంగా ఉండనుంది. ఈ రాశివారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 13 నుంచి ఈ రాశివారిపై కనకవర్షం కురవనుంది. దాంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిచేసే చోట గుర్తింపు ఉంటుంది.

3 /5

సింహ రాశి సంసప్తక రాజయోగం కారణంగా సింహ రాశి జాతకులకు అద్భుతమైన మార్పు ఉంటుంది. జీవితంలో ఊహించని ధనలాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమౌతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లేదా పదోన్నతి ఉంటుంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. ఆర్ధికంగా మంచి స్ఠితిలో ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. 

4 /5

వృషభ రాశి సంసప్తక రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు జీవితమే మారిపోనుంది. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. విద్యార్ధులకు కెరీర్ మెరుగుపడుతుంది ఆకశ్మిక ధనలాభం కలగడం వల్ల ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి.

5 /5

సంసప్తక రాజయోగం జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ ఉదయం 5 గంటల 49 నిమిషాలకు శుక్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే వృశ్చిక రాశిలో గురుడు ఉండటంతో రెండు గ్రహాల కలయికతో సంసప్తక రాజయోగం ఏర్పడనుంది. ఈ అరుదైన రాజయోగం కారణంగా 4 రాశులకు ఊహించని లాభం కలగనుంది. కలలో కూడా ఊహించనంతగా మార్పు సంభవించనుంది.