Dussehra Greetings: తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు.. ఏం చెప్పారంటే?

Dussehra Greetings By Cm Revanth And Chandrababu:  నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. వారు దసరా గ్రీటింగ్స్‌ ఎలా చెప్పారో తెలుసుకుందాం.
 

1 /5

చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటాం. నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గా పూజలు 9 రూపాల్లో పూజించిన తర్వాత పదవరోజు ఈ దసరా పండుగను జరుపుకుంటాం.  

2 /5

మన దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయాలు సైతం కిటకిటలాడతాయి. పెద్దపెద్ద మండపాలు ఏర్పాటు చేసి 9 రోజులపాటు దుర్గామాత పూజలు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12 నేడు ఈ ఏడాది దసరా పండుగ.  

3 /5

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. వారు ఏం చెప్పారో తెలుసా?  

4 /5

దసరా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరాను విజయదశమి అని కూడా అంటారు. ఇది చెడుపై మంచి గెలుపు తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రత్యేక స్థానం కలిగింది అన్నారు. అంతేకాదు రేవంత్‌ శమీ పూజ, జమ్మి ఇచ్చిపుచ్చుకోవడం, అలైబలై గురించి కూడా గుర్తు చేశారు. దుర్గామాత దయ వల్ల ప్రతిఒక్కరికీ సుకఃసంతోషాలు కలగాలని కోరుకుంటున్నా.. అందరికీ దసరా శుభకాంక్షలు అని తెలియజేశారు.  

5 /5

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. దుష్ట సంహారం తర్వాత శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని అన్నారు. దుర్గమ్మ ఆశీర్వాదాలు మీపై చల్లగా ఉండాలని కోరుకుంటున్నా అని సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెప్పారు.