UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు వచ్చే నెల నవంబర్ జరగనున్నాయి. ఈ అభ్యర్థులకు గతంలో రాత పరీక్ష నిర్వహించారు. పాసైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు.
యూపీఎస్‌సీ ఈపీఎఫ్ఓ ఇంటర్వ్యూ నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్నారు. ఈ మౌఖిక పరీక్ష ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు న్యూ ఢిల్లీలోని ధోలాపూర్‌లో ఉన్న షాజహాన్ రోడ్‌లో ఉన్న యూపీఎస్‌సీ ఆఫీసు వద్ద నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల పేరు, రోల్‌నంబర్, ఇంటర్వ్యూ తేదీలు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్వ్యూకు కావాల్సిన పత్రాలు.. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు ఈ కాపీలను కూడా తీసుకువెళ్లాలి.
పది పాసైన మార్క్ షీట్, అందులో పుట్టిన తేదీ సరిగ్గా ఉండాలి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ క్వాలిఫికేషన్, మీ కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) పీహెచ్ సర్టిఫికేట్. ఎంప్లాయర్ నుంచి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్
మీ పేరు ఏదైనా మారితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా తీసుకువెళ్లండి. ప్రభుత్వ సర్వీస్ డిక్లారేషన్. యూపీఎస్‌సీ ఈపీఎఫ్‌ఓ 2024 రిక్రూట్మెంట్ ద్వారా 418 పోస్టులను భర్తీ చేయనుంది.