Shani dev Transit: 2027 వరకు ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. తిరుగులేని రాజయోగం..

Shani dev transit: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. అందువలన శని దేవుడికి మంద గమనుడు అనే పేరు ఉంది. అందుకే శనిదేవుడు రాశి మార్పు వలన వచ్చే ఫలితాలు కూడా చాలా కాలం పాటు ఈ రాశుల పై ప్రభావం చూపిస్తూ  ఉంటాయి.

1 /5

జాతక చక్రంలో శని దేవుడు అనుగ్రహం అంటే అంతా శుభమే జరుగుతుంది. అదే మంచిగా లేకపోతే అడుగడున ఓటమి పాలు కాక తప్పదు. శని దేవుడు రాశి మార్పుతో 2027 వరకు ఈ మూడు రాశుల వారికి తిరుగులేని అదృష్టం తీసుకురాబోతుంది.

2 /5

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి రెండున్నరేళ్ల తర్వాత మంచి జరగబోతుంది. రాజయోగం కలగబోతుంది. చేసే వృత్తిలో మంచి పనితీరు కనబరుస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది.

3 /5

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి గత కొన్నేళ్లుగా అనుభస్తున్న కష్టాలు పరారు అవుతాయి. కొంత కాలంగా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయి. కొంత  కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బు చేతికి అందుతుంది. రాజయోగంతో ఉద్యోగంలో ప్రమోషన్. వ్యాపారంలో లాభాలు కలగుబోతున్నాయి.

4 /5

మకర రాశి.. మకర రాశి వారికి ఏడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏల్నాటి శని త్వరలో తొలిగిపోతుంది. శని దేవుడి అనుగ్రహం మీ సొంతం అవుతుంది. మీరు చేసే పనిలో కొత్త శిఖరాలు అందుకుంటారు. చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. అనుకోని డబ్బులు చేతికి అందుతాయి. పెళ్లి కానీ వారికి ఈ యేడాది పెళ్లి జరిగే అవకాశాలున్నాయి. 

5 /5

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు, జ్యోతిష్కులు ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఇవ్వబడింది.  ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.