Paneer Tawa Pulao: ఎప్పుడూ ఒకేరకం పులావ్‌ చేసి బోర్‌ కొట్టిందా? ఇలా రుచికరంగా పనీర్‌‌ తవా పులావ్‌ చేయండి..

Paneer Tawa Pulao Recipe: మనం రెగ్యులర్‌గా పలావ్‌ రిసిపీని తయారు చేసుకుంటాం. దీంతో చికెన్‌, ఎగ్‌, పన్నీర్‌, మష్రూమ్‌ పులావ్‌ కూడా తయారు చేసుకోవచ్చు. అయితే, ఎప్పుడూ ఒకేరకం పులావ్‌ తిని బోర్‌ కొట్టిందా?. ఈసారి కాస్త భిన్నంగా పన్నీర్‌ తవా పులావ్‌ తయారు చేసుకోండి. ఇది ఎంతో రుచికరంగా, టేస్టీగా ఉంటుంది.
 

1 /5

పన్నీర్‌ తయారు చేసేటప్పుడు అందులో పోషకాలు ఉండే వస్తువులు వేసి తయారు చేస్తాం. కానీ, మరింత రుచికరంగా చేయాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలి. మీరు కూడా ఇలా పన్నీర్‌ తవా పులావ్‌ తయారు చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.   

2 /5

పనీర్‌ పులావ్‌కు కావాల్సిన పదార్థాలు.. ఒక కప్పు అన్నం, చీజ్‌ 100 గ్రాములు, పచ్చిమిర్చి రెండు, వెల్లులలి రెండు రెబ్బలు, జీలకర్ర ఒక టీస్పూన్‌, కశ్మీరీ రెడ్ చిల్లీ మూడు స్పూన్లు, పావ్‌ బాజీ మసాలా ఒక స్పూన్‌, ఉప్పు రుచికి సరిపడా, పసుపు అరటీస్పూన్‌, నూనె ఒక స్పూన్‌, బట్టర్‌ ఒక స్పూన్‌, కూరగాయాలు మీకు కావాల్సినవి, జీడిపప్పు 10, కొత్తిమీరా అరకప్పు, నిమ్మరసం రెండు స్పూన్లు

3 /5

ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బియ్యం, పసుపు, ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి చట్నీ తయారు చేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు కూడా వేసి చట్నీ తయారు చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌ తీసుకుని స్టవ్‌ ఆన్‌ చేసి బట్టర్ వేయాలి.

4 /5

అందులోనే ఉల్లిపాయ వేసి బాగా వేయించండి. కూరగాయాలు కూడా వేయండి. పన్నీర్‌ కూడా నూనెలో వేయించి పెట్టుకోవాలని గుర్తుంచుకోండి. కూరగాయలు బాగా ఉడికిన తర్వాత వెల్లుల్లి, రెడ్‌ చిల్లీ చట్నీ, పన్నీర్ కూడా ఇందులో వేసుకోవాలి.   

5 /5

ఆ తర్వాత ఇందులో ఉడికించిన రైస్‌ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పావ్ బాజీ మసాలా కూడా వేయాలి. చివరగా నిమ్మరసం పిండుకోవాలి. వేడివేడిగా తింటే ఎంతో టేస్టీ