Weight Loss Drinks: ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్‌లో ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది

ఇటీవలి కాలంలో ఫిట్నెస్‌పై అందరీ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ఓ కీలకమైన ప్రక్రియగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇంటర్ మిట్టెంట్ ఫాస్టింగ్ అంటే కనీసం 12 గంటలు ఏం తినకుండా ఉండటం. ఇది మంచి ఫలితాలే ఇస్తోంది. కడుపు, నడుము చుట్టూ ఫ్యాట్ సులభంగా కరుగుతుంది. అయితే ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ఆచరించేవాళ్లు కొన్ని డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Weight Loss Drinks: ఇటీవలి కాలంలో ఫిట్నెస్‌పై అందరీ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ఓ కీలకమైన ప్రక్రియగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇంటర్ మిట్టెంట్ ఫాస్టింగ్ అంటే కనీసం 12 గంటలు ఏం తినకుండా ఉండటం. ఇది మంచి ఫలితాలే ఇస్తోంది. కడుపు, నడుము చుట్టూ ఫ్యాట్ సులభంగా కరుగుతుంది. అయితే ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ఆచరించేవాళ్లు కొన్ని డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 /5

గ్రీన్ టీ గ్రీన్ టీలో క్యాటెచిన్, కెఫీన్ ఉంటాయి. మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. ఫ్యాట్ కరిగించేందుకు దోహదం చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. 

2 /5

కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ సహజసిద్ధంగా ఉంటాయి. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఫాస్టింగ్ సమయంలో ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండేట్టు చేస్తుంది. ఇందులో ఉండే నేచురల్ షుగర్ కారణంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.

3 /5

లెమన్ వాటర్ లెమన్ వాటర్ అనేది బెస్ట్ హెల్తీ డ్రింక్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. మెటబోలిజం వృద్ధి చెందుతుంది.  రోజూ ఉదయం సమయంలో లెమన్ వాటర్ తాగడం వల్ల డీటాక్స్‌కు ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

4 /5

నీళ్లు రోజూ తగిన నీళ్లు తప్పకుండా తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రత్యేకించి శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. నీళ్లు తాగడం వల్ల ఆకలిపై కాస్త నియంత్రణ ఉంటుంది. 

5 /5

ఆపిల్ సిర్కా వాటర్ ఆపిల్ సిర్కా నీళ్లలో కలిపి తాగాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో బరువు తగ్గేందుకు దోహదమౌతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఆకలి కూడా నియంత్రిస్తుంది.