Pooja Hegde: బీచ్ లో పూజా హెగ్డే అందాలు.. బర్తడే సెలబ్రేట్ చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేసిన భామ..!

Pooja Hegde: బీచ్ లో పూజా హెగ్డే అందాలు.. బర్తడే సెలబ్రేట్ చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేసిన భామ..!

1 /6

పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో.. నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. తాజాగా ఈ నటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు.. ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి 

2 /6

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. పూజ హెగ్డే కి పెద్దగా అవకాశాలు లేవు. అయితే అంతకుముందు ఎన్నో రోజులపాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఈ హీరోయిన్.

3 /6

ముఖ్యంగా అరవింద సమేత, అలా వైకుంఠపురంలో లాంటి భారీ విజయాలలో సైతం నటించింది. నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో పరిచయమైన..పూజా హెగ్డే కెరియర్ మొదట్లోనే జిల్ జిల్ జిగేలురాణి అనే ఐటెం సాంగ్ నటించింది. అయితే రంగస్థలం సినిమాలోని ఈ ఐటెం సాంగ్..పూజకి మంచి పేరు తెచ్చి పెట్టింది.

4 /6

ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు అందుకుంటూ.. కొద్ది రోజులపాటు తెగ క్రేజ్ తో కొనసాగింది. అయితే చిరంజీవి, రామ్ చరణ్ తో చేసిన ఆచార్య సినిమా పూజా హెగ్డే కెరీర్ కి పెద్ద బ్రేక్ వేసింది. ఆ సినిమా తర్వాత నుంచి ఈ హీరోయిన్ కి వరసగా అపజయాలు వచ్చాయి. 

5 /6

తెలుగులో మాత్రమే అనుకుంటే.. పర భాషలైన తమిళం, హిందీలో కూడా పూజా హెగ్డే నటించిన అన్ని సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే నటించిన చిత్రం సైతం ఆమెకు డిజాస్టర్ గా నిలిచింది. 

6 /6

వరస ఫ్లాపులు వస్తున్న పూజ హెగ్డే కి.. ప్రస్తుతానికి అవకాశాలు అయితే మాత్రం కొన్ని వస్తున్నాయి. కానీ పూజ తన రెమ్యూనరేషన్ కూడా ఈమధ్య ఎక్కువగా పెంచిందని.. అందుకే వచ్చిన కొన్ని అవకాశాలు సైతం వెనక్కి వెళ్లాలని రూమర్ కూడా వినిపించింది.  ఏది ఏమైనా సినిమాల విషయం పక్కన పడితే తన గ్లామర్ తో మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది పూజ. తాజాగా పూజా హెగ్డే తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలు పూజ హెగ్డే బర్త్ డే కి సంబంధించినవి కావడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఈ హీరోయిన్.