Shruti Haasan walks out Dacoit : శృతిహాసన్ త్వరలో..అడివి శేష్ తో డెకాయిట్ సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు.. శృతిహాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ సినిమా హీరోతో డిఫరెన్స్ రావడం వల్ల ఇలా జరిగింది అని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు మీకోసం.
ప్రముఖ యంగ్ హీరో అడివి శేష్ తో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కలిసి నటిస్తున్న చిత్రం డెకాయిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఈమె తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ ఓరియంటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో అడివి శేష్ , శృతిహాసన్ గజదొంగలుగా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రాజెక్టులో భాగంగా ఒక పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందని , కానీ ఇప్పుడు సడన్గా ఈమె తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
శృతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. అందులో భాగంగానే సలార్ -2, కూలీ, చెన్నై స్టోరీ వంటి ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి. దీనికి తోడు డెకాయిట్ సినిమాలో కూడా ఈమె అవకాశాన్ని దక్కించుకుంది. క్షణం, గూడచారి వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షానీల్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఈ యాక్షన్ ఫిలిం లో వీరిద్దరూ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా వుండగా.. శృతి హాసన్ , సినిమా మేకర్స్ మధ్య వచ్చిన చిన్నపాటి విభేదాలే ఈ ప్రధాన నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.. ఈ మూవీ నుంచి ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ తప్పుకుందంటూ ఒక వార్త వినిపిస్తోంది. డేట్స్ ఇష్యూ కారణంగా శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోవడం వల్ల ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శృతిహాసన్ రజినీకాంత్ నటించిన కూలీ తోపాటు చెన్నై స్టోరీస్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోని డేట్స్ సెట్ కాకపోవడం వల్ల సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీనికి తోడు సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. అదీ కాకుండా శృతిహాసన్ ప్లేస్ లో మరొకరిని పెట్టడం అంటే కష్టంతో కూడుకున్న పని. దీంతో అడివి శేష్ సినిమాకి మరిన్ని కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.. మొత్తానికైతే ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే మేకర్స్ ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.