ITC Nimyle Launches Clean Equal Mission: క్లీన్ ఈక్వల్ మిషన్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. నిమైల్ కార్యక్రమం పాఠశాల, తల్లిదండ్రులు వారి పిల్లల జీవితాలలో ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన కార్యకలాపాల ద్వారా ఏకీకృతం చేయడంలో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు.
Bollywood celebrities: ప్రస్తుతం భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టార్ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న కెనడా పౌరుల గురించి తెలుసుకుందాం
Rashmika Latest Post Viral: నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అలియా భట్ తాజాగా నటించిన 'జిగ్రా' సినిమాను చూసి రష్మిక ఫిదా అయిపోయింది. సినిమాలో అలియా నటన, కథా ఎంపిక అద్భుతంగా ఉందని రష్మిక పొగడ్తల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా రష్మిక ఈ విషయాన్ని పంచుకుంది.
Dasara 2024 Sandadi: దసరా సందర్భంగా బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోలో కమెడియన్ ఆలీతో కొంతమంది నటులు వివిధ రకాల గెటప్స్ తో దర్శనం ఇవ్వబోతున్నారు. దీంతో ఈ దసరా బుల్లితెర వీక్షకులకు అద్భుతమైన ఫన్ ఎంటర్టైన్మెంట్ గా మారబోతోంది. ఒకే స్టేజిపై అన్ని గెటప్స్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నారు.
Dhanush Kubera : టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర ఒకేలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నాగర్జున ఖాకీ దుస్తులు వేసుకోబోతున్నారు.
Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ ఆలియా భట్, రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. పుష్ప సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
Lokesh Kanagaraj Leo: ఈ మధ్యనే దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం గురించి చిత్ర సినిమాటోగ్రాఫర్ ఒక షాకింగ్ ట్విస్ట్ బయట పెట్టారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథకి కీలకమైన ట్విస్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫ్లాష్ ప్యాక్ గురించి ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చేసిన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Yash Stardom: కన్నడ నటుడు పాన్ ఇండియా హీరో కేజీఎఫ్ విధ్వంసకుడు యశ్ క్రేజ్ మాములుగా లేదు. అతడంటే పడిచచ్చే అభిమానులుంటారంటారు కానీ నిజంగా అదే జరిగింది. అతడి కోసం ఓ అభిమాని నిజంగానే ప్రాణాలు తీసుకున్నాడు.
Ram Charan Gold Coin: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవలే మరో కథానాయకుడు ఎన్టీఆర్ కలిసి చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో సినిమాకు పనిచేసిన వారిలో కొందరికి రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్కరికి దాదాపు 10గ్రా. బంగారపు నాణేన్ని బహుమానంగా ఇచ్చారు.
Shyam Singha Roy hindi remake: నాని 'శ్యామ్ సింగరాయ్' మూవీని హిందీలో తెరకెక్కేంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది. ఆమె లుక్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.