Mahalakshmi Rajyayoga: దీపావళికి ముందే మహాలక్ష్మీ రాజ్యయోగం.. ఈ 3 రాశులవారికి రాజయోగం.. మీ రాశి ఇదేనా? చెక్‌ చేయండి..

Mahalakshmi Rajyayoga Before Diwali: దీపావళి పండుగ రాబోతుంది. అంతకు ముందే కొన్ని రాశులకు అత్యంత శుభకరం. ఎందుకంటే ధన్‌తేరాస్‌ ముందే మహాలక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఇది ఓ 3 రాశులవారికి మాత్రం రాజయోగాన్ని తీసుకువస్తుంది. అక్టోబర్‌ 31వ తేదీ దీపావళి ఈ ఏడాది రానుంది.  ఈ యోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓ సారి చెక్‌ చేయండి..
 

1 /5

హిందూ పురాణాల ప్రకారం దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయాలి. ఆరోజు ఎంతో శ్రేష్ఠమైంది. అమావాస్య రోజు దీపావళి పండుగను నిర్వహిస్తారు. అంతకు ముందు రోజు ధన్‌తేరాస్‌ కూడా ఉంటుంది. అయితే, దానికి ముందే కర్కాటక రాశిలో అంగారకుడు, చంద్రుని కలయికతో  మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడనుంది.   

2 /5

ఈ మహాలక్ష్మీ రాజయోగం వల్ల ఓ 3 రాశులవారి అదృష్టమే మారిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. దీంతో వారు జీవితంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ మహాలక్ష్మీ రాజ్యయోగం వల్ల బాగా కలిసి వచ్చే రాశులు ఏంటో తెలుసుకుందాం.  

3 /5

మేషరాశి.. మహాలక్ష్మీ రాజ్యయోగం వల్ల బాగా కలిసి వచ్చే రాశి మేషరాశి. ఇంట్లో సుకఃశాంతులు వెల్లివిరుస్తాయి. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఈ సమయంలో మేష రాశివారు కొత్త ఇల్లు, వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. మొత్తానికి మేష రాశివారికి అన్ని విధాలుగా కలిసివచ్చే కాలం.

4 /5

తుల రాశి.. తుల రాశివారికి కూడా వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మహాలక్ష్మీ రాజ్య యోగం వల్ల అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అంతేకాదు పని ప్రదేశంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు. నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం.

5 /5

వృశ్చిక రాశి.. మహాలక్ష్మీ రాజయోగం ఈ రాశివారికి తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ యానం చేసే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. భాగస్వామితో ఆనందంగా విహరించే సమయం. అంతేకాదు వృశ్చిక రాశివారికి కూడా పని ప్రదేశంలో మంచి గుర్తింపు లభించే అవకాశం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)