Radhika Apte: తల్లి కాబోతున్న బాలయ్య బ్యూటీ.. ఫోటో వైరల్..!

Radhika Apte Pregnant: లెజెండ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాధిక ఆప్టే. ఆ తరువాత బాలకృష్ణ లయన్ సినిమాలో సైతం కనిపించి మెప్పించింది. తాజాగా ఈ హీరోయిన్ కి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ.. ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

1 /5

ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే తల్లి కాబోతున్నారు.  ఈమె నటించిన సిస్టర్ మిడ్ నైట్ మూవీని బి ఎఫ్ ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్ 2024 లో ప్రదర్శించిన సందర్భంగా.. రాధిక అక్కడ బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. 

2 /5

తాజాగా బేబీ బంప్ తో దర్శనం ఇవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దీంతో ఇవి చూసిన అభిమానులు,  నెటిజన్ లు,  తోటి నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

3 /5

రాధిక ఇంగ్లాండ్ కు చెందిన మ్యూజిషియన్ బెనడిక్ట్ టేలర్ ను 2012లో వివాహం చేసుకున్నారు. ఇక 12 ఏళ్ల తర్వాత ఈమె గర్భం దాల్చడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. 

4 /5

రాధిక ఆప్టే నటించిన చిత్రాల విషయానికి వస్తే.. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి చిత్రాలలో నటించారు రాధిక. ముఖ్యంగా బాలయ్యతో రెండు సినిమాలు చేసేసరికి బాలయ్య బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఇక్కడ మళ్లీ చిత్రాలలో నటించలేదు.

5 /5

ఇకపోతే బి ఎఫ్ ఐ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆకట్టుకుంది రాధిక. అంతే కాదు ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  బ్లాక్ డ్రెస్ లో  బేబీ పంపుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.  మొత్తానికి అయితే 12 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్న ఈ ముద్దుగుమ్మకు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతుంది.