Muthyalamma: ధ్వంసం చేసిన చోట ఐక్యతారాగం.. బోనాలతో ముత్యాలమ్మ ఆలయానికి పునరుజ్జీవం

Kummariguda Local People Offers Bonalu To Vandalised Muthyalamma Temple: హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు తిరిగి పూజలు ప్రారంభించారు. బస్తీవాసులంతా కలిసి అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

1 /8

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ వారి విగ్రహాన్ని ఓ వర్గం వ్యక్తి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.

2 /8

దాడిలో ధ్వంసమైన ఆలయాన్ని కుమ్మరిగూడ బస్తీవాసులు అందరూ కలిసికట్టుగా పునరుద్ధరించుకున్నారు.

3 /8

ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా సొంతంగా బస్తీవాసులు ఏకమై ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేశారు.

4 /8

పూజల అనంతరం శుక్రవారం ముత్యాలమ్మ అమ్మవారికి బస్తీవాసులు బోనాలు నిర్వహించారు.

5 /8

వేడుకల్లో జోగిని శ్యామల పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

6 /8

బస్తీవాసులంతా కలిసి సామూహికంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.

7 /8

బోనాలు నిర్వహించడంతోపాటు ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడం ద్వారా బస్తీవాసులు ఐక్యత చాటారు. ఇది అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.

8 /8

ఈ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు పలువురు ప్రముఖులు, హిందూ సంఘాలు పాల్గొన్నాయి.