Health Tips: సడెన్‎గా బీపీ డౌన్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే నార్మల్ అవుతుంది

Low BP:  హైబీపీ వలే లోబీపీ కూడా చాలా ప్రమాదకరం. బీపీ తక్కువగా ఉన్నప్పుడు...తలతిరగటం, బలహీనత, ఆపస్మారక స్థితిలోకి వెళ్తారు. సడెన్ గా బీపీ డౌన్ అయితే ఏం  చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /6

Low BP:  నేటికాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో లోబీపీ కూడా ఒకటి. దీనిని హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో చాలా మందికి కాలక్రమేణా లోబీపీ సమస్య ఏర్పడుతుంది.   

2 /6

లోబీపీ అనేది మనిషి సాధారణ సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దానినే లోబీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని లోబీపీగా పరిగణిస్తారు. 

3 /6

చాలామంది లోబీపీ సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్బాల్లో ఊహించకుండా సడెన్ గా కుప్పకూలిపోవచ్చు. అంతేకాదు గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే ఛాన్స్ ఉంటుంది.   

4 /6

సడెన్ గా బీపీ తగ్గితే ఏం చేయాలో చూద్దాం.  అకస్మాత్తుగా బీపీ తగ్గితే వెంటనే అలర్ట్ అవ్వాలని  నిపుణులు చెబుతున్నారు.  ఎందుకంటే లోబీపీ అనేది చాలా ప్రమాదకరం. ఎవరికైనా హఠాత్తుగా బీపీ తక్కినట్లయితే వెంటనే పడుకోబెట్టాలి.  కాళ్ళను పైకి ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే  అవయవాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  

5 /6

డీహైడ్రేషన్ వల్ల కూడా లోబీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది . అటువంటి పరిస్థితిలో లోబీపీకి గురైన వ్యక్తికి వెంటనే నీరు ఇవ్వండి. ఉప్పుతో ఉన్న స్నాక్స్ లేదా  ఉప్పునీరు ఇవ్వండి. ఇది బీపీని పెంచడంలో సహాయపడుతుంది. కెఫిన్ ఉన్న పానీయాలు కూడా బీపీని పెంచుతాయి.  

6 /6

ఒక్కోసారి కొన్ని మందుల వల్ల సడెన్ గా లోబీపీకి గురవుతారు.అలాంటి పరిస్ధితి ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. షాక్ లేదా రక్తం పోవడం వల్ల ఎవరికైనా లోబీపీకి గురైతే  వెంటనే వైద్యుల వద్ద తీసుకెళ్లాలి. రక్త పరిమాణాన్ని వేగంగా పెంచడానికి ఇంట్రావీనస్ ద్రవాలు తరచుగా ఇవ్వాలి. కొన్ని మందుల సాయంతో బీపీ కూడా పెరుగుతుంది.