Kummariguda Local People Offers Bonalu To Vandalised Muthyalamma Temple: హైదరాబాద్ సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు తిరిగి పూజలు ప్రారంభించారు. బస్తీవాసులంతా కలిసి అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎంపీ ఈటల రాజేందర్తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హైదరాబాద్ సికింద్రాబాద్లోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ వారి విగ్రహాన్ని ఓ వర్గం వ్యక్తి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.
దాడిలో ధ్వంసమైన ఆలయాన్ని కుమ్మరిగూడ బస్తీవాసులు అందరూ కలిసికట్టుగా పునరుద్ధరించుకున్నారు.
ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా సొంతంగా బస్తీవాసులు ఏకమై ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేశారు.
పూజల అనంతరం శుక్రవారం ముత్యాలమ్మ అమ్మవారికి బస్తీవాసులు బోనాలు నిర్వహించారు.
వేడుకల్లో జోగిని శ్యామల పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
బస్తీవాసులంతా కలిసి సామూహికంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
బోనాలు నిర్వహించడంతోపాటు ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడం ద్వారా బస్తీవాసులు ఐక్యత చాటారు. ఇది అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.
ఈ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తోపాటు పలువురు ప్రముఖులు, హిందూ సంఘాలు పాల్గొన్నాయి.