Best Herbal Tea: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. కొలెస్ట్రాల్ కారణంగా గుండె వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు నియంత్రణలో లేకుంటే ప్రాణాంతకం కావచ్చు. కొలెస్ట్రాల్ అనేది రక్త ప్రసరణలో ఆటంకం కల్గించడం ద్వారా హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులకు కారణమౌతుంది. అయితే కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహజసిద్ధమైన పద్ధతులు ఉన్నాయి. కొన్ని రకాల హెర్బల్ టీలు తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..
పసుపు టీ పసుపులో కర్క్యూమిన్ రక్తనాళాల్లో జమ అయిన ప్లక్, కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. పసుపు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
దాల్చిన చెక్క దాల్చిన చెక్క టీ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో పేరుకునే కొవ్వును కూడా తగ్గిస్తాయి.
వెల్లుల్లి టీ కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఎలిసిన్ అనే రసాయనం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. వెల్లుల్లి టీ గుండె ధమనుల్ని క్లీన్ చేస్తుంది.
అల్లం టీ అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదం చేస్తాయి. అల్లం టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలమౌతుంది. రోజూ ఉదయం వేళ తాగితే మంచి ఫలితాలుంటాయి.
గ్రీన్ టీ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి. ఇందులో ఉండే కైటోచిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త నాళికలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది