ATM Cash Withdraw Rules: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం డబ్బు లావాదేవీలు ఆన్‌లైన్ చెల్లింపులు చేపడుతున్నారు. చిన్న బడ్డికొట్టు నుంచి అతి పెద్ద మాల్స్ కూడా ఆన్‌లైన్ పేమెంట్స్‌ను వినియోగిస్తున్నారు. దీందో డబ్బు వాడకం కూడా తగ్గిపోయింది. అయితే, అప్పుడప్పుడు డబ్బు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తాం. ఆధార్ కార్డుతో ఎటీఎంతో పనిలేకుండా డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసా?
సాధారణంగా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలంటే మన వద్ద ఏటీఎం కార్డ ఉండాల్సిందే. దీనిద్వారా డబ్బు విత్‌డ్రా చేస్తాం. అయితే ఏటీఎం కార్డు అవసరం లేకుండా, కేవలం ఆధార్ కార్డుతో డబ్బు విత్‌డ్రా చేయడం తెలుసా? ఒక్కోసారి డబ్బు ఏటీఎం నుంచి డ్రా చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ సమస్యలు వస్తాయి. ఆధార్ కార్డుతో కూడా డబ్బు విత్‌డ్రా చేయొచ్చు.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (AePS) ద్వారా ఆధార్ కార్డుపై ఉన్న నంబర్ ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. ఆధార్ కార్డుతో డబ్బులు విత్ డ్రా చేయాలంలే ఏఈపీఎస్ సపోర్ట్ చేస్తే మైక్రో ఏటీఎం వద్దకు వెళ్లండి. అందులో 12 డిజిట్ల నంబర్ మైక్రో ఏటీఎం మెషీన్‌లో ఎంటర్ చేయాలి.
అందులో మీ ఫింగర్ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాలి. అందులో క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు కావాల్సిన డబ్బు అక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు ఏటీఎం నుంచి డబ్బు చేసి, రిసీట్ కూడా తీసుకోవాలి.
ఏఈపీఎస్ అంటే బ్యాంకింగ్ సంబంధించిన సర్వీసులను నిర్వహిస్తుంది. ఇది ఆధార్ కార్డు ఉపయోగించి ఈ పనులు చేపడుతుంది. క్యాష్ విత్ డ్రా, బ్యాలన్స్ ఎంక్వైరీ, ఫండ్ ట్రాన్స్‌ఫర్ పనులు చేపడుతుంది. NPCI ద్వారా ఈ పనులను నిర్వహిస్తుంది.
ఏఈపీఎస్ ద్వారా రూ.10,000-రూ.50,000 వరకు నగదు విత్‌డ్రా చేయవచ్చు. ఈ సర్వీసు ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా అందిస్తోంది. కొన్ని భద్రత కారణాల వల్ల కొన్ని ఏటీఎంలలో ఏఈపీఎస్ డిసేబుల్ చేస్తారు. అయితే, అథారైజ్ మైక్రో ఏటీఎం నుంచి మాత్రమే డబ్బు విత్‌డ్రా చేయాలని గుర్తుంచుకోండి.
ఎందుకంటే మీ ఆధార్ కార్డు మైక్రో ఏటీఎంలో మాత్రమే పెట్టాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా నమోదు చేయాలి. ఆధార్ కార్డు ద్వారా డబ్బు విత్‌డ్రా చేయడం చాలా సులభం. చివరగా రిసిట్ తీసుకోవడం మర్చిపోవద్దు.