Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..

Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్‌ ప్లాన్‌ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రెండూ సేవలను అందిస్తుంది. పెరిగిన టెలికాం ధరలతో చాలామంది జియో కస్టమర్లు ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ప్లాన్లకు ముందుకు తీసుకువస్తుంది. కేవలం రూ.175 రీఛార్జీ ప్లాన్‌తో 12 ఓటీటీలు ఉచింగా పొందవచ్చు. 
 

1 /5

జియో ఈ బంపర్‌ రీఛార్జీ ప్యాక్‌ చేసుకోవాలంటే మై జియో యాప్‌ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఆస్వాదించేవారికి ఇది బంపర్‌ గుడ్ న్యూస్‌. 28 రోజుల వ్యాలిడిటీతో 12 ఓటీటీలు ఉచితంగా పొందుతారు. ఇందులో మీకు 10 జీబీ డేటా కూడా ఉచితంగా పొందుతారు.   

2 /5

అయితే, ఈ రీఛార్జీ ప్లాన్‌లో ప్రతిరోజు ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలు పొందలేరు. 100 ఎస్‌ఎంఎస్‌లు అందుకోరు. ఇది కేవలం ప్రస్తుతం ఉన్న మీ రీఛార్జీ ప్లాన్‌కు యాడ్‌ ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం డేటా ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే వర్తిస్తుంది.   

3 /5

ఈ రూ.175 రీఛార్జీ ప్లాన్‌తో 12 ఓటీటీలు 28 రోజులపాటు ఉచితంగా పొందుతారు. ఈ ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లు మూడు నెలలకు కూడా ఉన్నాయి. రూ.329, రూ.1029, రూ.1029 రీఛార్జీ ప్లాన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

4 /5

ఈ ప్యాక్‌లో మీర అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌తోపాటు ఓటీటీ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. కానీ, ఈ రూ.175 రీఛార్జీ ప్లాన్‌లో మాత్రం వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం ఉండదు. జియో రూ.355 ఫ్రీడం  ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ కూడా పొందుతారు. ఇందులో 25 జీబీ డేటా కూడా ఉంది. అయితే, ఇందులో డైలీ డేటా లిమిట్‌ ఉండదు.  

5 /5

ఈ రీఛార్జీ ప్యాక్‌లో మాత్రం కూడా 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇందులో అదనంగా ఈ రీఛార్జీ ప్యాక్‌లను యాడ్‌ ఆన్‌ చేసుకోవాల్సి వస్తుంది.