Hero Romance With Sister: తెలుగు సినీ ఇండస్ట్రీలో అపుడపుడు కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి. హీరో, హీరోయిన్స్ గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వాళ్లు.. ఆ తర్వాత రియల్ లైఫ్ లో అన్నా చెల్లులు వరుస అయిన సందర్భాలున్నాయి. ఈ రకంగా సిల్వర్ స్క్రీన్ పై ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వీళ్లిద్దరు ఆ తర్వాత అన్నా చెల్లెలుగా ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు.
వెంకటేష్ తెలుగులో తన తరంలో టాప్ 4లో ఒక హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు హీరోగా 75 సినిమాల్లో నటించి ఇప్పటికీ టాలీవుడ్ లో సత్తా చూపిస్తున్నాడు.
వెంకటేష్ నటుడుగా ఒక జానర్ కు పరిమితం కాకుండా అన్ని యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, మహిళ సెంటిమెంట్, కుటంబ కథా చిత్రాలతో తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
దాదాపు 40 యేళ్ల సినీ కెరీర్ లో దాదాపు ఎంతో మంది హీరోయిన్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసారు. ఖుష్బూ నుంచి మొదలు పెడితే.. శ్రద్ధా శ్రీనాథ్ వరకు ఎంతో మంది భామలు వెంకీ సరసన మెరిచారు. అయితే తనకు చెల్లి వరుస అయిన హీరోయిన్ తో రొమాన్స్ చేసారు.
ఆమె ఎవరో కాదు.. అమల అక్కినేని.. ఆమెను నాగార్జున రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు నాగార్జున వెంకటేష్ చెల్లెలు అయిన నాగార్జునను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో వాళ్లిద్దరు విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ల లీడ్ చేస్తున్నారు. నాగ్, లక్ష్మీల కుమారుడే నాగ చైతన్య.
అయితే.. వెంకటేష్ చెల్లిని విడాకులు ఇచ్చిన తర్వాత అమలను నాగార్జునను రెండో వివాహాం చేసుకున్నారు. ఈ రకంగా చూసుకుంటే.. వెంకటేష్ కు అమలా చెల్లెలు వరుస అవుతోంది.
వెంకటేష్, అమల తొలిసారి బి.గోపాల్ దర్శకత్వంలో ‘రక్త తిలకం’ సినిమా చేసారు. ఆ తర్వాత ‘అగ్గి రాముడు’ సినిమాల్లో వీళ్లిద్దరు జోడిగా నటించారు. అటు అమల .. తెలుగు, తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.
ఏది ఏమైనా వెంకటేష్, అమల పెళ్లి కాక ముందు నటించడం పెద్ద విషయం కాదు. కానీ పెళ్లైన తర్వాత మాత్రం అమల సినిమాలకు దూరంగా కుటుంబమే లోకంగా కాలం వెళ్లదీస్తోంది.