Gutti Vankaya Kura: పెళ్లిళ్ల స్టైల్‌ ఘుమఘుమలాడే గుత్తివంకాయ ఇలా వండితే.. ఎవ్వరైనా లొట్టలేసుకుని తినాల్సిందే..!

Gutti Vankaya Kura Recipe: గుత్తివంకాయ అంటే ఇష్టం లేనివారు ఉండరు. ఏ పెళ్లిళ్లు శుభకార్యాల్లో అయిన ఘుమఘుమలాడే గుత్తివంకాయ కూర ఉండాల్సిందే. ఈ కూర లేనిదే మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భోజనం ఉండదంటే నమ్మండి. మ్యారేజ్‌ స్టైల్‌లో రుచికరమైన గుత్తివంకాయ కూరను ఇలా చేశారంటే లొట్టలేసుకుని తింటారు. తిన్న ప్రతి ఒక్కరూ వారెవ్వా అనాల్సిందే. రుచికరమైన గుత్తివంకాయ ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ రిసిపీ మీ ఇంట్లో వండితే వీధి వరకు ఆ ఘుమఘుమలు వస్తాయి. పెళ్లిళ్ల స్టైల్‌లో గుత్తివంకాయ కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం.
 

1 /5

మంచి గుత్తివంకాయలు కాస్త చిన్నసైజు- పావుకిలో, ఉల్లిగడ్డలు-2, కారం-చెంచా, పసుపు- అరటీస్పూన్‌, నూనె- కూరకు సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒక స్పూన్, చింతపండు- నిమ్మకాయ సైజు (నానబెట్టుకోవాలి), కరివేపాకు, ఎండుకొబ్బరి- రెండు చెంచాలు, గసాలు- స్పూన్‌, నువ్వులు- స్పూన్‌, పల్లీలు- రెండు స్పూన్లు, ఆవాలు, జిలకర్ర- స్పూన్‌, ధనియాల పొడి- ఒక స్పూన్‌, జిలకర్ర- ఒక స్పూన్‌, మెంతులు- అరటీస్పూన్‌, యాలకులు-3, లవంగాలు-4  

2 /5

ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో పల్లిలు, నువ్వులు, గసాలు ఒకదాని తర్వాత మరోటి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.‌ ఆ తర్వాత వంకాయలను గుత్తివంకాయ మాదిరి గాటు పెట్టుకోవాలి. వీటిని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.   

3 /5

ఇప్పుడు ఈ పల్లిల మిక్చర్‌లో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని ఇందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జిలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత యాలకులు, లవంగాలు వేయాలి. ఆ తర్వాత కట్‌ చేసిన ఉల్లిపాయలు దోరగా వేయించాలి.   

4 /5

కరివేపాకు అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. కారం,పసుపు వేయాలి. ఆ తర్వాత ఈ మాసాలా పేస్ట్‌ కూడా వేసి నూనె పైకి తేలేవరకు మీడియం మంటపై వేయించుకోవాలి.   

5 /5

ఇప్పుడు చింతపండు గుజ్జు తగినన్ని నీరు పోసుకుని బాగా ఓ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయలు, ధనియాలు, జిలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఓ 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికిస్తే ఘుమఘుమలాడే గుత్తివంకాయ కూర రెడీ అవుతుంది.